
ICC T20 World Cup United States vs India: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరుగుతోన్న మ్యాచ్ లో టీమిండియా స్వింగ్ బౌలర్ అర్ష్ దీప్ చెలరేగాడు. నాలుగు కీలక వికెట్లు పడగొట్టి అమెరికా నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 4 ఓవర్లు వేసిన ఈ స్టార్ పేసర్ కేవలం 9 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఫలితంగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. నితీశ్‌కుమార్ (27) టాప్ స్కోరర్ గా నిలవగా, స్టీవెన్ టేలర్ 24 పరుగులతో రాణించారు. ఇక మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ 4, హార్దిక్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. కాగా ఈ పిచ్ బౌలర్లకు బాగా సహకరిస్తుంది. ఇదే గ్రౌండ్లో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాక్ 120 పరుగులు ఛేదించలేక చతికిలపడింది. కాబట్టి భారత బ్యాటర్లు జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సిందే. లేకుంటే టీ20 ప్రపంచ కప్ లో మరో సంచలనం తప్పదు. ఇప్పటికే ఇదే అమెరికా పాకి స్తాన్ జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. కాబట్టి సొంత గడ్డపై ఆడుతోన్న అమెరికా జట్టుతో అప్రమత్తంగా ఆడాల్సిందేనంటున్నారు క్రికెట్ నిపుణులు.
Innings Break!
Solid bowling display from #TeamIndia! 👏 👏
4⃣ wickets for @arshdeepsinghh
2⃣ wickets for @hardikpandya7
1⃣ wicket for @akshar2026Stay Tuned as India begin their chase! ⌛️
Scorecard ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #USAvIND pic.twitter.com/jI2K6SuIJ5
— BCCI (@BCCI) June 12, 2024
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్, ఆండ్రీస్ గౌస్(w), ఆరోన్ జోన్స్(c), నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్
Describe the catch in 1️⃣ word! ✍️
We start – 𝗦𝗧𝗨𝗡𝗡𝗜𝗡𝗚! 🙌 🙌
Follow The Match ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #TeamIndia | #USAvIND | @mdsirajofficial pic.twitter.com/Zr9xu7GysP
— BCCI (@BCCI) June 12, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..