T20 World Cup 2021, Ind vs Pak: వీరి ఆట వేరే లెవల్.. పాక్‌తో మ్యాచ్ అంటే పూనకాలే..!
IND vs PAK: ఈ గొప్ప మ్యాచ్‌కు ముందు కొంతమంది భారత ఆటగాళ్ల గురించి మీకు ఇప్పుడు తెలుసుకుందాం. వీరు పాకిస్థాన్‌పై ఎంతో గొప్పగా ప్రదర్శన చేసి, చుక్కలు చూపించారు. బరిలొకి దిగుతున్నారంటే మాత్రం పాక్ ఆటగాళ్లు భయపడేవారు.

T20 World Cup 2021: భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకు పండగే. ఈ రెండు దేశాలు ఎప్పుడు ఢీకొన్నా థ్రిల్లింగ్ పీక్స్‌లో ఉంటుంది. అక్టోబర్ 24న మరోసారి ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ గొప్ప మ్యాచ్‌కు ముందు కొంతమంది భారత ఆటగాళ్ల గురించి మీకు ఇప్పుడు తెలుసుకుందాం. వీరు పాకిస్థాన్‌పై ఎంతో గొప్పగా ప్రదర్శన చేసి, చుక్కలు చూపించారు. బరిలొకి దిగుతున్నారంటే మాత్రం పాక్ ఆటగాళ్లు భయపడేవారు.
వెంకటేష్ ప్రసాద్ టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్.. పాకిస్తాన్‌తో ఆడినప్పుడల్లా అద్భుతంగా ఆడేవాడు. 1996 ప్రపంచకప్‌లో అమీర్ సోహైల్ వికెట్ తీసిన కథను ఎవరూ మర్చిపోలేరు. ఈ మ్యాచ్‌లో వెంకటేష్ మూడు వికెట్లు తీయడంతో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1999 ప్రపంచకప్‌లో, ఈ ఆటగాడు మరోసారి పాకిస్థాన్ పరిస్థితిని మరింత దిగజార్చాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 227 పరుగులు చేసింది.
ఈ లక్ష్యాన్ని ఛేదించడం పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌కి చాలా సులభంగా అనిపించింది. కానీ, ఆ రోజు వెంకటేశ్ ప్రసాద్ వేరే లెవల్లో ఉన్నాడు. 36 పరుగుల వద్ద అత్యంత ప్రమాదకరమైన పాక్ బ్యాట్స్‌మెన్ సయీద్ అన్వర్‌ను ఔట్ చేశాడు. అనంతరం వెంకటేష్ ప్రసాద్.. సలీం మాలిక్, ఇంజమామ్-ఉల్-హక్, మొయిన్ ఖాన్, వసీం అక్రమ్‌లను పెవిలియన్ చేర్చి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్‌ను విచ్ఛిన్నం చేశాడు. మ్యాచ్‌లో వెంకటేష్ ప్రసాద్ 27 పరుగులకు 5 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
లక్ష్మీపతి బాలాజీ.. తమ బౌలింగ్, బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌లో గందరగోళం సృష్టించిన ఆటగాళ్ల జాబితాలో లక్ష్మీపతి బాలాజీ పేరు కూడా ఉంటుంది. బాలాజీ ఆట, అతని చిరునవ్వు పాకిస్థాన్ అభిమానులను పిచ్చెక్కించాయి. 2004 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లలో బాలాజీ 5 వికెట్లు పడగొట్టాడు. భారత సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లోని ఐదవ వన్డేలో, షోయబ్ అక్తర్ వేసిన బాల్‌ను బాలాజీ అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
2012 టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఈ ఆటగాడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో బాలాజీ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
ఇర్ఫాన్ పఠాన్ 2006 లో ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. అయితే పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ జావేద్ మియాందాద్.. భారత బౌలర్‌పై స్టేట్మెంట్ ఇచ్చాడు. పఠాన్ వంటి బౌలర్లు పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతారంటూ ఎద్దేవా చేశాడు. అయితే, కరాచీ టెస్ట్ మొదటి ఓవర్‌లో పఠాన్ హ్యాట్రిక్ సాధించి తన సమాధానాన్ని గట్టిగా వినిపించాడు.
2007 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇర్ఫాన్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అతను 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మనుగడ సాగించడానికి పఠాన్ అనుమతించలేదు. అతని అద్భుత ప్రదర్శన ఆధారంగానే టీమిండియా తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది.
అజయ్ జడేజా 9 మార్చి 1996న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్లో అజయ్ జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా 47 ఓవర్లలో 236 పరుగులు చేసింది. ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్రమాదకరమైన బౌలర్లలో ఒకరైన వకార్ యూనిస్ అద్భుతంగా బౌలింగ్ చేసినా, అజయ్ జడేజా అతడిని భయపెట్టాడు. ఈ మ్యాచ్‌లో జడేజా 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఆసమయంలో జడేజా180 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.
వకార్ ఒక ఓవర్‌లో జడేజా 23 పరుగులు చేశాడు. ఆ ఓవర్ మొదటి బంతికి మూడు పరుగులు చేసిన తర్వాత, అజయ్ తర్వాతి నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. అతను చివరి బంతికి ఔట్ అయ్యాడు. కానీ, అంతకు ముందు భారత్‌ను భారీ స్కోర్‌కి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
T20 World Cup 2021, IND vs PAK: భారత్‌తో తలపడే పాకిస్తాన్ టీం ఇదే.. వెల్లడించిన పీసీబీ




