AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ XI ఇదే.. పాకిస్తాన్‌కు చుక్కలే.. లిస్టులో మిస్టరీ స్పిన్నర్!

సూపర్ సండేకు సమయం ఆసన్నమైంది. దాయాదుల పోరు కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో...

T20 World Cup: టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ XI ఇదే.. పాకిస్తాన్‌కు చుక్కలే.. లిస్టులో మిస్టరీ స్పిన్నర్!
Ind Vs Pak
Ravi Kiran
|

Updated on: Oct 23, 2021 | 9:42 PM

Share

సూపర్ సండేకు సమయం ఆసన్నమైంది. దాయాదుల పోరు కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత దాయాది దేశాలు రెండూ ఢీ అంటే ఢీ అనేలా తలబడనున్నాయి. మరి ఈ టీ20లో గెలిచేది ఎవరు.? గత రికార్డులు ఏం చెబుతున్నాయి..

క్రికెట్ ఫ్యాన్స్‌కు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఓ యుద్ధం లాంటిది. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరిగిందంటే.. ఫ్యాన్స్ ఓ యుద్ధం జరిగినట్లుగా ఫీల్ అవుతారు. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ.. ప్రతీ సెకండ్ మారే సమీకరణాలు.. ఎవరి మీద ఎవరు పైచేయి సాధిస్తారు.. ఇలా అంతా కూడా టెన్షన్.. మ్యాచ్ క్లైమాక్స్‌కు చేరే వరకు ప్రతీ మూమెంట్‌ ఎమోషనల్.

టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌లకు ఐదు టీమిండియానే గెలిచింది. 2007 వరల్డ్ కప్ బౌలౌట్‌తో మొదలైన భారత్ విజయ ప్రస్థానం 2016 ప్రపంచకప్ వరకు కొనసాగింది. అంతేకాకుండా పాకిస్తాన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అటు రోహిత్ శర్మ కూడా పాక్‌పై అదరగొట్టాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో రేపు జరిగే మ్యాచ్‌కు టీమిండియా బెస్ట్ ప్లేయింగ్ XI ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ ఈ పదకొండు మంది ప్లేయర్స్ బరిలోకి దిగితే.. పాకిస్తాన్‌కు చుక్కలే అని నెటిజన్లు అంటున్నారు. మరి ఆ ప్లేయింగ్ XIపై ఓ లుక్కేద్దాం పదండి.!

టీమిండియా(అంచనా): విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి

పాకిస్తాన్: బాబర్ అజామ్ (సి), రిజ్వాన్, ఫఖర్ జమాన్, హఫీజ్, మాలిక్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షహీన్, హారిస్ రౌఫ్

India Team