T20 World Cup 2021, IND vs PAK: భారత్‌తో తలపడే పాకిస్తాన్ టీం ఇదే.. వెల్లడించిన పీసీబీ
IND vs PAK: భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకు పండగే. ఈ రెండు దేశాలు ఎప్పుడు ఢీకొన్నా థ్రిల్లింగ్ పీక్స్‌లో ఉంటుంది. అక్టోబర్ 24న మరోసారి ఇరు జట్లు తలపడనున్నాయి.

Pakistan Squad: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది క్రికెట్ అభిమానులు తమ టెలివిజన్‌లకు అతుక్కుపోయే సమయం వచ్చింది. దాదాపు 30,000 మంది ప్రేక్షకులు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉత్కంఠ మ్యాచును వీక్షించేందుకు సిద్ధమయ్యారు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ టీంలు తమ తొలి సమరాన్ని అక్టోబర్ 24న ఆదివారం దుబాయ్‌లో మొదలుపెట్టనున్నారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో ఎంతో ముఖ్యమైన మ్యాచ్ కావడంతో రేపటి పోరుపై ఇరుదేశాల అభిమానులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇద్దరు మాజీ ఛాంపియన్‌ల మధ్య మ్యాచ్ రాత్రి 7.30లకు మొదలుకానుంది.
అయితే బరిలోకి దిగే ప్లేయింగ్ XIపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంచనాలు పటాపంచలు చూస్తూ భారత్‌తో బరిలోకి దిగే ప్లేయింగ్ స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇందులో మొత్తం 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మ్యాచ్ ముందు ప్లేయింగ్ XIను ప్రకటించనున్నారు. కాగా, పాకిస్తాన్ టీం 5 గురు బ్యాట్స్‌మెన్స్, ముగ్గురు బౌలర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. బాబర్ అజామ్, అసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ బ్యాట్స్‌మెన్లు కాగా, మహ‍్మద్ రిజ్వాన్ కీపర్ కం బ్యాట్స్‌మెన్, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. అలాగే హారిస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ బౌలర్లుగా బరిలోకి నిలవనున్నారు.
2007లో జోహన్నెస్‌బర్గ్‌లోని ది వాండరర్స్‌లో జరిగిన ప్రారంభ టోర్నమెంట్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి, 2009లో లార్డ్స్‌లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్నాయి.
డర్బన్‌లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007లో టీ20 ఫార్మాట్‌లో పాకిస్తాన్ వర్సెస్ భారత్ మొదటిసారి తలపడ్డాయి. రెండు జట్లూ 141 పరుగులతో ముగియడంతో టీమిండియా బౌల్-అవుట్‌లో విజయం సాధించింది. అప్పటి నుంచి టీ20 ప్రపంచ కప్‌లో 2007 ఎడిషన్ ఫైనల్‌తో సహా – ఇరు జట్లు మరో నాలుగు సార్లు తలపడ్డాయి. ఈ మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించింది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ రెండవ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో, పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ వరుసగా రెండు, ఏడవ స్థానాల్లో టాప్-10లో ఉన్నారు. ఇక భారత ఆటగాడు విరాట్ కోహ్లి నాల్గవ స్థానంలో నిలిచాడు. మరోవైపు టాప్ -10 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్, భారత బౌలర్లు లేకపోవడం గమనార్హం. అయితే, భువనేశ్వర్ కుమార్ 11 వ స్థానంలో ఉన్నాడు.
పాకిస్తాన్ స్వ్కాడ్: బాబర్ అజామ్ (సి), రిజ్వాన్, ఫఖర్ జమాన్, హఫీజ్, మాలిక్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షహీన్, హారిస్ రౌఫ్
Pakistan open T20 World Cup campaign on Sunday
More details ➡️ https://t.co/jNJ0nfEIOg#WeHaveWeWill | #T20WorldCup
— PCB Media (@TheRealPCBMedia) October 23, 2021




