AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak High Voltage Fights: టీమిండియా- పాకిస్తాన్ ప్లేయర్ల కొట్లాట.. మధ్యలో అంపైర్లు బలి.. ఎప్పుడు జరిగిందంటే?

అక్టోబర్ 24 నుంచి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అరంగేట్రం చేయనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ రెండు జట్లు ఫీల్డ్‌‌లోకి దిగినప్పుడు హై ఓల్టేజ్ డ్రామా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Ind vs Pak High Voltage Fights: టీమిండియా- పాకిస్తాన్ ప్లేయర్ల కొట్లాట.. మధ్యలో అంపైర్లు బలి.. ఎప్పుడు జరిగిందంటే?
T20 World Cup 2021, India Vs Pakistan High Voltage Fights
Venkata Chari
|

Updated on: Oct 23, 2021 | 2:56 PM

Share

Ind vs Pak, T20 World Cup 2021: అక్టోబర్ 24 నుంచి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అరంగేట్రం చేయనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ రెండు జట్లు ఫీల్డ్‌‌లోకి దిగినప్పుడు హై ఓల్టేజ్ డ్రామా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఇదివరకు జరిగిన కొన్ని హై వోల్టేజ్ పోరాటాల గురించి తెలుసుకుదాం.

జావేద్ మియాందాద్ వర్సెస్ కీపర్ కిరణ్ మోర్.. 1992 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ మాజీ లెజెండరీ బ్యాట్స్‌మెన్ జావేద్ మియాందాద్ వర్సెస్ భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోర్ మధ్య జరిగిన పోరాటాన్ని ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. మియాందాద్ మోర్‌ను ఆటపట్టించడానికి కిరణ‌ మోర్ మైదానంలో కప్పలా దూకడం ప్రారంభించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పాక్‌కు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అమీర్ సోహైల్, మియాందాద్ తమ జట్టు స్కోరును రెండు వికెట్లకు 100 దాటించారు. అనంతరం ఒక్కసారిగా పాక్ వికెట్లు పతనమడం ప్రారంభమయ్యాయి. అయితే మోర్ వికెట్ల వెనుక నుంచి పదే పదే అప్పీల్ చేస్తున్నాడు.

ఇంతలో, మియాందాద్ షాట్ కొట్టి, పరుగు కోసం ప్రయత్నించాడు. రిటర్న్ త్రోలో మోర్ బెయిల్స్ పడగొట్టాడు. ఈ సమయంలో మియందాద్ కోపంతో కప్పలా గెంతుతూ రెచ్చగొట్టాడు. తర్వాత మియాందాద్ కొద్దిసేపటికే ఔటయ్యాడు. తనదైన శైలిలో మియాందాద్‌కు కప్పలా జంప్ చేస్తూ కీపర్ సమాధానమిచ్చాడు.

వెంకటేష్ ప్రసాద్- అమీర్ సొహైల్.. 1996 ప్రపంచకప్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు పాకిస్తాన్‌కు 288 పరుగుల లక్ష్యాన్ని అందించింది. పాక్ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో అమీర్ సోహైల్ భారత ప్లేయర్ వెంకటేష్ ప్రసాద్‌ను ఆఫ్‌సైడ్‌లో ఫోర్ కొట్టి, ఆ తర్వాత తన బ్యాట్‌తో చూపిస్తూ వెంకటేష్‌ను మళ్లీ అదే వైపు ఫోర్ కొడతానంటూ సైగ చేశాడు. ఆ సమయంలో వెంకటేష్ ఏమీ మాట్లాడలేదు. కానీ, మరుసటి బంతికి సోహైల్ బౌల్డ్ అయ్యాడు. దీంతో వెంకటేష్ ప్రసాద్ క్రీజు నుంచి వెళ్లమంటూ సిగ్నల్ ఇచ్చాడు.

ఆ తర్వాత వెంకటేశ్ ప్రసాద్ పాక్ బ్యాట్స్‌మెన్ సోహైల్‌ని చూస్తూ పెద్దగా అరుస్తూ పెవిలియన్‌కు తిరిగి వెళ్లాలని సూచించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ ప్రసాద్ 3 వికెట్లు పగడొట్టాడు. దీని తర్వాత 1999 ప్రపంచకప్‌లోనూ వెంకటేష్ పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో అతని ఖాతాలో 5 వికెట్లు చేరాయి. ఈ మ్యాచ్‌లో కూడా పాకిస్తాన్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

హర్భజన్ సింగ్-షోయబ్ అక్తర్ 2010 ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, హర్భజన్ సింగ్ పాక్ బౌలర్ మొహమ్మద్ అమీర్‌పై వరుసగా ఆరు సిక్సర్లతో జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. భజ్జీతో గొడవపడేందుకు హోటల్‌కు చేరుకున్న అక్తర్‌కు కోపం వచ్చింది.

కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ అక్తర్ ఇలా అన్నాడు, ‘మేము లాహోర్‌లో కలిసి ప్రయాణించాం. మాది ఒకే సంస్కృతి. అతను నా పంజాబీ సోదరుడు. ఇంకా అతను మ్యాచ్ సమయంలో మాపై దారుణంగా ప్రవర్తించాడు. హోటల్ రూంకి వెళ్లి వాళ్లతో గొడవ పడదాం అనుకున్నాను. షోయబ్ వస్తున్నాడని హర్భజన్‌కు తెలుసు. కానీ, నేను అతనిని కనుగొనలేకపోయాను. దాంతో నాకోపం తగ్గిపోయింది. మరుసటి రోజు అతను నాకు క్షమాపణ కూడా చెప్పాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 267 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు తడబడినా, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లు జట్టుకు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు.

గౌతమ్ గంభీర్- కమ్రాన్ అక్మల్ ఆసియా కప్ 2010లో టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్, మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నారు. పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వికెట్ వెనుక నుంచి పదేపదే ఔట్ కావాలంటూ అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు గంభీర్ కోపంగా ఉన్నాడు. మైదానంలో ఇద్దరి మధ్య చాలా పోరాటం జరిగింది. ఇద్దరూ కూడా ఒకరినొకరు దూషించుకున్నారు.

దీంతో వాగ్వాదం మరింత పెరిగి జట్టు సభ్యులు, అంపైర్‌ను రక్షించాల్సి వచ్చింది. ధోనీ, గంభీర్‌ని ఎలాగోలా శాంతింపజేసి బ్యాటింగ్ చేయమని అడిగాడు. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా విజయం సాధించింది. గంభీర్ 2007లో షాహిద్ అఫ్రిదితో ఇలాగే గొడవపడ్డాడు. మైదానంలోనే ఇద్దరి మధ్య దూషణలు జరిగాయి. మరోసారి అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరూ శాంతించారు.

Also Read: IND vs PAK, T20 World Cup 2021: వరుణ్ ఔట్.. హార్ధిక్ ఇన్..! టీమిండియా ప్లేయింగ్ XIపై TV9తో సీనియర్ సెలెక్టర్

India vs Pakistan, T20 World cup 2021: విరాట్ కోహ్లీ సేనతో తొలిసారి తలపడనున్న పాకిస్తాన్ ఆటగాళ్లు ఎవరో తెలుసా?