T20 World Cup 2021 AUS vs SA Highlights: బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. సఫారీలపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం..
Australia vs South Africa Live Score in Telugu: 2021 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12 స్టేజిలో గ్రూప్ 1 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ అబుదాబీ వేదికగా..

టీ20 వరల్డ్ కప్ మెన్స్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేయగా, స్వల్ప లక్ష్యంతో దిగిన ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. 5 వికెట్లు కోల్పోయి 19.4 బంతుల్లో లక్ష్యాన్ని చేధించి టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది.
ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ పేస్ ఎటాక్ ముందు సఫారీలు తలొగ్గారు. వరుస వికెట్లు కోల్పోతూ.. తక్కువ స్కోర్‌కే ఇన్నింగ్స్‌ను ముగించారు. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 118 పరుగులు చేశారు. మార్కారమ్(40) టాప్ స్కోరర్ కాగా.. చివర్లో రబాడ(19) మెరుపులు మెరిపించడంతో.. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజల్‌వుడ్, జంపా రెండేసి వికెట్లు తీయగా.. కమిన్స్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.
Toss update from Abu Dhabi ?
Australia have elected to field first.
Who’s winning this one? #T20WorldCup | #AUSvSA | https://t.co/SGLZbYpGoo pic.twitter.com/Cqsquvbv73
— T20 World Cup (@T20WorldCup) October 23, 2021
South Africa end up with a total of 118/9 ?
Will it prove to be enough? #T20WorldCup | #AUSvSA | https://t.co/SGLZbYpGoo pic.twitter.com/iW05oa8CQp
— T20 World Cup (@T20WorldCup) October 23, 2021
LIVE NEWS & UPDATES
-
ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ..
టీ20 వరల్డ్ కప్ మెన్స్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేయగా, స్వల్ప లక్ష్యంతో దిగిన ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. 5 వికెట్లు కోల్పోయి 19.4 బంతుల్లో లక్ష్యాన్ని చేధించి టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది.
-
100 మార్కును దాటేసిన ఆస్ట్రేలియా..
సౌతాఫ్రికా ఇచ్చిన 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఆచితూచి ఆడుతూ లక్ష్యానికి చేరువుతోంది. ఇందులో భాగంగానే 18 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉంటుంది.
-
-
ఆస్ట్రేలియాకు మరో దెబ్బ మ్యాక్స్‌వెల్ కూడా అవుట్..
ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తబ్రేజ్ షంసి బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్ వెల్ బౌల్డ్ అయి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆస్ట్రేలియా ఆరు 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 16.3 ఓవర్లకు గాను 86 పరుగల వద్ద కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా గెలవాలంటే 21 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంది.
-
మరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా స్మిత్ అవుట్..
ఆస్ట్రేలియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డ స్టీవ్ స్మిత్ 35 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. నార్జ్ విసిరిన బంతికి షాట్‌కు ప్రయత్నించిన స్మిత్.. మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 15 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 81 పరుగుల వద్ద కొనసాగుతోంది.
-
పది ఓవర్లకు సౌతాఫ్రికా స్కోర్ ఎంతంటే..
118 పరుగుల లక్ష్యంతో దిగిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతోంది. ఈ నేపథ్‌యంలో 10 ఓవర్లు ముగిసే సమయానికి 52 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో స్మిత్ (19), మాక్స్‌వెల్ (06) పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా గెలవాలంటే 59 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
మరో వికెట్ గాన్.. వెను తిరిగిన మిచెల్ మార్ష్..
సౌతాఫ్రిక ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో వికెట్‌ను కోల్పోయింది. కేశవ్ మహరాజ్ విసిరిన బంతికి షాట్‌కు ప్రయత్నించగా వాన్ డర్ డసెస్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ 11 పరుగల వద్ద వెనుతిరిగాడు.
-
వార్నర్ ఔట్..
వరుస ఫోర్లతో జోరు మీదున్న వార్నర్ పెవిలియన్ చేరాడు. రబాడా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీనితో ఐదు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది.
-
ఆసీస్ కెప్టెన్ డకౌట్..
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. నార్తేజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి.. రబడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో మూడు ఓవర్లకు ఆసీస్ వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(10), మార్ష్(1)తో క్రీజులో ఉన్నాడు.
-
ఆసీస్ ముందు స్వల్ప టార్గెట్..
ఆసీస్ పేస్ ఎటాక్ ముందు సఫారీలు తలొగ్గారు. వరుస వికెట్లు కోల్పోతూ.. తక్కువ స్కోర్‌కే ఇన్నింగ్స్‌ను ముగించారు. నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 118 పరుగులు చేశారు.
-
ఎనిమిదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..
దక్షిణాఫ్రికా కీలక ఆటగాడైన మార్కరమ్ వికెట్‌ను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు నుంచి పరుగులు రాబట్టిన ఈ ప్లేయర్.. స్టార్క్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
17 ఓవర్‌లో 12 పరుగులు..
హాజల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో దక్షిణాఫ్రికా 12 పరుగులు రాబట్టింది. రబడా ఓ ఫోర్ కొట్టగా.. మార్కారమ్ మొదటి బంతికి భారీ సిక్స్ కొట్టాడు. దీనితో ఈ ఓవర్ ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోర్ 98కి చేరుకుంది.
-
15 ఓవర్లకు దక్షిణాఫ్రికా 83/7
దక్షిణాఫ్రికా తేలిపోయింది. 15 ఓవర్లు ముగిసేసరికి కేవలం 83 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే అప్పటికే 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం మార్కరమ్(32), రబడా(0) క్రీజులో ఉన్నారు.
-
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..
ఆడమ్ జంపా వేసిన 14 ఓవర్‌లో సఫారీలు రెండు వికెట్లు కోల్పోయారు. మిల్లర్, ప్రీతోరిస్ వరుస బంతుల్లో పెవిలియన్ చేశారు. దీనితో దక్షిణాఫ్రికా 14 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 82 పరుగులు చేసింది.
-
పీకల్లోతు కష్టాల్లో దక్షిణాఫ్రికా..
సగం ఇన్నింగ్స్ పూర్తయింది. దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. 10 ఓవర్లు ముగిసేసరికి సఫారీలు నాలుగు వికెట్లు నష్టపోయి 59 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో మార్కారమ్(19), మిల్లర్(5) ఉన్నారు.
-
మరో రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్లు కోల్పోయింది. వరుసపెట్టి డికాక్, క్లాసన్ వికెట్లను కోల్పోయింది. దీనితో ఎనిమిది ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 46 పరుగులు చేసింది. ప్రస్తుతం మర్కారం(18), మిల్లర్(0) క్రీజులో ఉన్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..
రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. డుస్సెన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. హాజల్‌వుడ్ వేసిన ఓవర్‌లో వికెట్ కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
-
మొదటి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా..
దక్షిణాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ వేసిన రెండో ఓవర్‌లో సఫారీ టీం కెప్టెన్ బవుమా భారీ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. దీనితో 13 పరుగుల వద్ద సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు.
-
మొదటి ఓవర్ 11 పరుగులు..
స్టార్క్ వేసిన మొదటి ఓవర్‌లో సఫారీలు 11 పరుగులు రాబట్టారు. బవుమా రెండు అద్భుతమైన ఫోర్లు సంధించాడు. ప్రస్తుతం క్రీజులో బవుమా(11), డికాక్(0) ఉన్నారు.
-
ఆసీస్‌కు అగ్ని పరీక్ష…
ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ అగ్ని పరీక్ష అని చెప్పాలి. సరైన ప్లేయర్స్ లేక సతమతమవుతున్న ఆ జట్టు.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో ఏడుగురు బ్యాట్స్‌మెన్లతో రంగంలోకి దిగుతోంది.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్క్ స్టాయినిస్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
-
జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్క్ స్టాయినిస్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, బవుమా (కెప్టెన్), మార్‌క్రమ్, వాన్ డర్ డసెన్, డేవిడ్ మిల్లర్, క్లాసెన్, ప్రీతోరిసుస్, కగిసో రబాడ, కేశవ్, నార్జ్, తబ్రేజ్ షంసి
-
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా సూపర్ 12 గ్రూప్ 1 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుండగా.. ఇందులో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు టీంలు గెలుపే ధ్యేయంగా తమ అస్త్రాలను సిద్దం చేశాయి.
Toss update from Abu Dhabi ?
Australia have elected to field first.
Who’s winning this one? #T20WorldCup | #AUSvSA | https://t.co/SGLZbYpGoo pic.twitter.com/Cqsquvbv73
— T20 World Cup (@T20WorldCup) October 23, 2021
Published On - Oct 23,2021 3:01 PM




