Suryakumar Yadav: వన్డేల్లో ఏ మాత్రం వెలగని సూరీడు.. సంజూకు ఛాన్స్ ఇవ్వాలంటోన్న ఫ్యాన్స్

టీ20 క్రికెట్‌లో నంబర్ 1 బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. పదే పదే అవకాశాలు వచ్చినా మన సూర్యుడు ఏ మాత్రం వెలగడం లేదు.

Suryakumar Yadav: వన్డేల్లో ఏ మాత్రం వెలగని సూరీడు.. సంజూకు ఛాన్స్ ఇవ్వాలంటోన్న ఫ్యాన్స్
Suryakumar Yadav
Follow us
Basha Shek

|

Updated on: Mar 20, 2023 | 9:39 AM

టీ20 క్రికెట్‌లో నంబర్ 1 బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. పదే పదే అవకాశాలు వచ్చినా మన సూర్యుడు ఏ మాత్రం వెలగడం లేదు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లోనూ సూర్య కుమార్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. సూర్య ప్లాఫ్‌ షో ఈ రెండు వన్డేలకే పరిమిత కాలేదు. గత కొంతకాలంగా ఈ ఫార్మాట్‌లో పరుగులు చేయడానికి అతను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఇలాగే ఆడితే వన్డే ప్రపంచకప్ జట్టుకు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు క్రికెట్‌ నిపుణులు. వన్డే ప్రపంచకప్‌ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది ఆరంభంలో పటిష్టమైన జట్టును ఏర్పాటు చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది. ఇందులో భాగంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. అందులో సూర్య కూడా ఒకరు. ప్రపంచకప్‌ ప్రణాళికల్లోనే భాగంగానే అతనికి గత కొన్ని సిరీస్‌లలో వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. అయితే వన్డే క్రికెట్‌లో 20 ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ సగటు పరుగులు 25 మాత్రమే కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా గత 5 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే రెండు సార్లు సున్నాకి ఔట్ అయ్యాడు. చివరి 10 వన్డే ఇన్నింగ్స్‌లలో, అతని అత్యధిక స్కోరు 34 పరుగులు మాత్రమే.

2021లో వన్డేల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ మొదటి 3 ఇన్నింగ్స్‌ల్లో 124 పరుగులు చేసి కొత్త ఆశలు కల్పించాడు. కానీ 2022లో 12 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 260 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది 5 ఇన్నింగ్స్‌ల్లో 49 పరుగులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వరుసగా గోల్డెన్ డక్‌ అయ్యాడు. రెండుసార్లు మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో సూర్యకుమార్ వన్డే కెరీర్‌పై అనుమానాలు తలెత్తున్నాయి. ఎందుకంటే వన్డే క్రికెట్‌లో 20 ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ 25.47 సగటుతో 433 పరుగులు మాత్రమే చేశాడు. అయినా ఈ ముంబై ఆటగాడికి వరుసగా అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా వరుసగా విఫలమవుతున్న సూర్య స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను ఎంపిక చేయాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మోకాలి గాయం నుంచి కోలుకున్న శాంసన్‌ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?