Sunil Gavaskar: టీమిండియా ఆటగాళ్ల సాక్షిగా గవాస్కర్‌ను అవమానించిన ఆస్ట్రేలియా.. లిటిల్ మాస్టర్ ఏమన్నారంటే?

సునీల్ గవాస్కర్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ట్రోఫీ అందజేతలో భాగస్వామ్యం లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. బోర్డర్‌తో కలిసి ట్రోఫీ ఇవ్వాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు నెటిజన్లలో చర్చలకు దారితీశాయి. 1996 నుండి ట్రోఫీ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించింది.

Sunil Gavaskar: టీమిండియా ఆటగాళ్ల సాక్షిగా గవాస్కర్‌ను అవమానించిన ఆస్ట్రేలియా.. లిటిల్ మాస్టర్ ఏమన్నారంటే?
Sunny
Follow us
Narsimha

|

Updated on: Jan 06, 2025 | 11:40 AM

సిడ్నీ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సిరీస్ ట్రోఫీని ఆసీస్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ చేతుల మీదుగానే అందజేయడం, తనను పిలవకపోవడం పట్ల గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 ఏళ్ల తర్వాత ఆసీస్ జట్టు ట్రోఫీ గెలుచుకున్నప్పటికీ, ఇది ఒక పరస్పర గౌరవానికి సంకేతంగా ఉండాల్సిన సందర్భమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

గవాస్కర్ మాట్లాడుతూ, “నన్ను పిలవకపోవడం నాకు బాధగా అనిపించింది. బోర్డర్‌తో కలిసి ట్రోఫీ అందజేయడం ఎంతో ప్రత్యేకమై ఉండేది. ఇది ఒక భారత క్రికెట్ అభిమానిగా నాకు కూడా గౌరవంగా అనిపించేది. అయినప్పటికీ, నేను విజయాన్ని అభినందిస్తాను, కానీ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోవడం సరైనదిగా అనిపించలేదు” అన్నారు.

అతని వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు గవాస్కర్ భావనను సమర్థిస్తుంటే, మరికొందరు “సిరీస్ ఓడిపోయిన జట్టు సభ్యుడిగా ఎలా ట్రోఫీ అందజేస్తాడు?” అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సెటైరికల్ కామెంట్లు కూడా వెలువడ్డాయి, “అలిగావా గవాస్కర్?” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

1996-97 సీజన్ నుంచి ప్రారంభమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రపంచ క్రికెట్‌లో ఎంతో ప్రాధాన్యమయినది. 17 సిరీస్‌లలో భారత జట్టు 10 సార్లు విజేతగా నిలవగా, ఆస్ట్రేలియా 6 సార్లు ట్రోఫీ గెలుపొందగా, ఒక్క సారి సిరీస్ డ్రా గా ముగిసింది. కానీ తాజా సీజన్‌లో ఆసీస్ తమ ఆధిపత్యాన్ని చూపించింది.