AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇలా ఎలా జరిగే కేన్ మామా.. సొంత టీంమేట్ దెబ్బకు.. 12 ఏళ్ల తర్వాత చెత్త రికార్డ్‌లోకి..

Kane Williamson Run Out Video: విలియమ్సన్ ఔటైన తర్వాత ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 179 పరుగులకే ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ అత్యధికంగా 79 పరుగులు చేశాడు. చివర్లో మ్యాట్ హెన్రీ 42 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు, న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో విలియమ్సన్ బ్యాట్ మెరిసింది. ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో విలియమ్సన్ రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించాడు.

Video: ఇలా ఎలా జరిగే కేన్ మామా.. సొంత టీంమేట్ దెబ్బకు.. 12 ఏళ్ల తర్వాత చెత్త రికార్డ్‌లోకి..
Kane Williamson Run Out
Venkata Chari
|

Updated on: Mar 01, 2024 | 11:55 AM

Share

New Zealand vs Australia Test Match: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా జరుగుతోంది. బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ జీరోకే ఔటయ్యాడు. ఖాతా కూడా తెరవలేకపోయాడు. అతని ఇన్నింగ్స్ కేవలం రెండు బంతుల్లోనే ముగిసింది. విలియమ్సన్ అవుట్ కావడం న్యూజిలాండ్‌కు పెద్ద దెబ్బగా మారింది. ఎందుకంటే కివీస్ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్స్ బ్యాటింగ్‌పైనే ఆధారపడింది. విలియమ్సన్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆడలేదు. అదే సమయంలో అతనికి 12 సంవత్సరాలుగా జరగనిది ఇక్కడ ఎదురైంది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేసింది. అందుకు కామెరాన్ గ్రీన్ 174 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఈ స్కోరు ముందు న్యూజిలాండ్ జట్టు తడబడింది. ఆ జట్టులోని టాప్-4 బ్యాట్స్‌మెన్స్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు.

2012 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి..

న్యూజిలాండ్ మొత్తం స్కోరు 12 పరుగుల వద్ద టామ్ లాథమ్ వికెట్ కోల్పోయినప్పుడు, విలియమ్సన్ మైదానంలోకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత టీమ్‌ని టేకోవర్ చేస్తారనిపించింది. కానీ, ఇది జరగలేదు. విలియమ్సన్ తన సొంత ఆటగాడి చేతిలో రనౌట్ కావడంతో పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. ఆరో ఓవర్ వేయడానికి వచ్చిన మిచెల్ స్టార్క్ బంతిని ఫుల్ లెంగ్త్‌లో వేశాడు. విలియమ్సన్ దానిని మిడ్ ఆఫ్‌లోకి తరలించాడు. విలియమ్సన్ ఒక పరుగు తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అవతలి ఎండ్‌లో నిలబడిన విల్ యంగ్, విలియమ్సన్ పిలుపును వినకుండా బంతిని చూడటం ప్రారంభించాడు. విలియమ్సన్ అతడిని ఢీకొట్టాడు. ఇంతలో, లాబుస్చాగ్నే బంతిని అందుకొని స్టంప్‌పై నేరుగా త్రో కొట్టాడు. విలియమ్సన్ తన ఖాతా తెరవడానికి ప్రయత్నించాడు. కానీ రనౌట్‌ కావడంతో.. 2012 తర్వాత విలియమ్సన్ టెస్టులో తొలిసారి ఇలా ఔటవ్వాల్సి వచ్చింది.

న్యూజిలాండ్ ఫైటింగ్..

విలియమ్సన్ ఔటైన తర్వాత ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 179 పరుగులకే ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ అత్యధికంగా 79 పరుగులు చేశాడు. చివర్లో మ్యాట్ హెన్రీ 42 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు, న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో విలియమ్సన్ బ్యాట్ మెరిసింది. ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో విలియమ్సన్ రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ తన బ్యాట్‌తో పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే