Badminton World Federation : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ కు సింధు, శ్రీకాంత్
గత ఏడాది చైనా వేదికగా జరుగాల్సిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
Badminton World Federation : గత ఏడాది చైనా వేదికగా జరుగాల్సిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ అర్హత సాధించారు. ఈ నెల 27 నుంచి 31 వరకు ఈ టోర్నీ థాయ్‌లాండ్‌లో జరుగనుంది.
టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి, మిక్స్‌డ్ డబుల్స్ ద్వయం సాత్విక్-అశ్వినీ పొన్నప్పుకు టూర్ ఫైనల్స్‌లో చోటు దక్కలేదు. కరోనా ఆందోళనతో జపాన్, చైనా షట్లర్లు దూరమవడంతో 14వ ర్యాంకులో ఉన్న శ్రీకాంత్ కు అవకాశం దక్కింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
”నన్ను అనవసరంగా పొగుడుతున్నారు.. ఘనత అంతా కుర్రాళ్లదే” హుందాగా జవాబిచ్చిన ద్రావిడ్..