Asia Cup: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆసియా కప్ టోర్నీకి ముహూర్తం ఫిక్స్.. మెయిన్ టోర్నీ ఎప్పటినుంచంటే..
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ (IPL) టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 26న షురూ కానున్న ఈ ధనాధన్ క్రికెట్ సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ (IPL) టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 26న షురూ కానున్న ఈ ధనాధన్ క్రికెట్ సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ జోష్‌లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ చెప్పారు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జైషా (Jay Shah) . కరోనా కారణంగా గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న ఆసియా కప్ టోర్నీ నిర్వహణకు సంబంధించి ఆయన ఒక శుభవార్త చెప్పారు. ఐపీఎల్ ముగిసిన రెండు నెలల తర్వాత శ్రీలంక (Srilanka) వేదికగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. మెయిన్ టోర్నీ ఆగస్టు 27 నుంచి ఆరంభం కానుండగా.. అంతకు ముందే ఆగస్టు 20 నుంచి క్వాలిఫయింగ్ టోర్నీ జరగనుంది. మ్యాచ్‌లన్నీ టీ20 ఫార్మాట్‌లోనే జరుగుతాయి. ఈమేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
భారత్‌దే ఆధిపత్యం..
భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ జట్లు నేరుగా ఈ టోర్నీలో పాల్గొనుండగా.. మరో స్థానం కోసం యూఏఈ, హాంకాంగ్, సింగపూర్, కువైట్ క్వాలిఫయర్స్ టోర్నీ ఆడనున్నాయి. కాగా1984 నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 సార్లు ఆసియా కప్ జరగింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ ఏడుసార్లు ఆసియాకప్‌ను గెల్చుకోగా.. ఆ తర్వాతి శ్రీలంక ఐదు టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది. ఇక 2018లో చివరిసారిగా జరిగిన టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచింది. ఇక కరోనా వల్ల 2020లో టోర్నీ జరగలేదు. 2021లో జరపాలని తొలుత భావించినా పరిస్థితులు అనుకూలించలేదు. అయితే ఎట్టకేలకు ఈ టోర్నీకి మోక్షం కలగడంతో క్రికెట్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక శనివారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ జనరల్ మీటింగ్ సమావేశం జరిగింది. ఇందులోనేఉ ఆసియా కప్ నిర్వహణపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా హాజరయ్యారు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీసీ ప్రెసిడెంట్ గా జై షా టర్మ్ ను మరో ఏడాది పాటు పొడిగించారు.
AGM Update: The ACC Members unanimously decided that the tenure of Mr. @JayShah as ACC President and that of the Executive Board along with its Committees will continue until the 2024 AGM @BCCI @TheRealPCB @BCBtigers @ACBofficials @ThakurArunS pic.twitter.com/ah8FKIQ7D4
— AsianCricketCouncil (@ACCMedia1) March 19, 2022
The Asia Cup 2022 (T20 Format) will be held in Sri Lanka from 27 August – 11 September later this year. The Qualifiers for the same will be played 20 August 2022 onwards.
— AsianCricketCouncil (@ACCMedia1) March 19, 2022
East Godavari: పవన్ తూర్పుగోదావరిలో ఎక్కడా పోటీ చేసినా ఓడిస్తా.. వైసీపీ ఎమ్మెల్యే ఛాలెంజ్