SRH vs LSG, IPL 2022: ఊరించి ఉసూరుమనిపించి.. ఛేదనలో చతికిలపడిన సన్‌ రైజర్స్‌.. 12 పరుగుల తేడాతో పరాజయం..

SRH vs LSG, IPL 2022: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG)తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

SRH vs LSG, IPL 2022: ఊరించి ఉసూరుమనిపించి.. ఛేదనలో చతికిలపడిన సన్‌ రైజర్స్‌.. 12 పరుగుల తేడాతో పరాజయం..
Srh Vs Lsg
Follow us
Basha Shek

|

Updated on: Apr 05, 2022 | 12:05 AM

SRH vs LSG, IPL 2022: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG)తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 157/9 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్‌ త్రిపాఠి (44), నికోలస్‌ పూరన్‌ (34) రాణించారు. అవేశ్‌ ఖాన్‌ (24/4) అద్భుత బౌలింగ్‌తో లక్నో జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకు ముందు కెప్టెన్ KL రాహుల్ (68), దీపక్ హుడా (51) అద్భుతమైన ఇన్నింగ్స్‌ల కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల మోస్తరు లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఓవర్లు మొత్తం ముగిసే సరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగాఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. లక్నోకు వరుసగా రెండో విజయం . కాగా నాలుగు వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అవేశ్‌ఖాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

లక్ష్యానికి చేరువగా వచ్చినా..

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు శుభారంభం లభించలేదు. నాలుగో ఓవర్ మూడో బంతికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16) ఔటయ్యాడు. అవేష్ ఖాన్ వేసిన బంతిని విలియమ్సన్ స్కూప్ ఆడేందుకు ప్రయత్నించాడు కానీ బంతి నేరుగా ఆండ్రూ టై చేతుల్లోకి వెళ్లింది. ఆతర్వాత అభిషేక్ శర్మ (13) కూడా కెప్టెన్‌ దారినే అనుసరించాడు. అతను కూడా అవేశ్ ఖాన్‌కే వికెట్‌ సమర్పించుకున్నాడు. మార్క్రామ్ మరియు రాహుల్ త్రిపాఠి భాగస్వామ్యం. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ ఐడెన్ మర్కరమ్, రాహుల్ త్రిపాఠి ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అయితే కృనాల్ పాండ్యా మర్కరమ్ (12)ను ఔట్‌ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఆ తర్వాత ధాటిగా ఆడుతోన్న త్రిపాఠి కూడా పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకోవడంతో 95 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. కాగా ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన పూరన్‌ జట్టును గెలిపించడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. సంయమనంతో ఆడుతూనే వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్స్‌ లు కొట్టాడు. దీంతో ఒకనొకదశలో హైద్రాబాద్‌ విజయం సాధించేలా కనిపించింది. అతను అయితే అవేష్ ఖాన్ వేసిన 18వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్‌ ఆడే యత్నంలో హుడాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు పూరన్‌. ఆ తర్వాతి బంతికే అబ్దుల్ సమద్‌ కూడా కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో హైద్రాబాద్‌ ఆశలు అడుగంటాయి. చివరి ఓవర్లలో లక్నో బౌలర్లు మరింత విజృంభించడంతో టార్గెట్‌కు 12 పరుగుల దూరంలో ఆగిపోయింది.

ఆదుకున్న  రాహుల్‌, దీపక్‌ హుడా..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్‌కు కూడా శుభారంభం లభించలేదు. ఆ జట్టు ఎనిమిది పరుగులకే వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ (1) వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ అతడిని ఔట్‌ చేశాడు. ఆతర్వాత నాలుగో ఓవర్లో లక్నోకు రెండో దెబ్బ తగిలింది. ఈ ఓవర్ తొలి బంతికే ఎవిన్ లూయిస్‌ను సుందర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఐదో ఓవర్లో రొమారియో షెపర్డ్‌ మనీష్ పాండేను ఔట్‌ చేశాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు మూడు వికెట్ల నష్టానికి 32 పరుగులు. ఆ తర్వాత దీపక్ హుడా, కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ స్కోరును 100 దాటించారు. దీపక్ హుడా 33 బంతుల్లో 51 పరుగులు చేసి ఔట్‌ కాగా.. రాహుల్‌ 40 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇది 28వ అర్ధ సెంచరీ. అతనితో పాటు ఆయుష్‌ బదోని (19) చివర్లో వేగంగా పరుగులు చేయడంతో 169 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, టి నటరాజన్ చెరో రెండు వికెట్లు తీశారు.

Also Read: Gulkand Benefit: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే గుల్కండ్ తయారీ ఎలానో తెలుసా.. Multibagger Stocks: రూ. 13వేల పెట్టుబడిని రూ. కోటిగా మార్చిన బంపర్ స్టాక్.. అదేంటంటే?

Multibagger Stocks: రూ. 13వేల పెట్టుబడిని రూ. కోటిగా మార్చిన బంపర్ స్టాక్.. అదేంటంటే?