Kavya Maran : కావ్యా పాప కలలో కూడా ఈ ముగ్గురిని వదులుకోదు..SRHకు వీళ్లే ప్రాణం.. ఇంతకీ వాళ్లు ఎవరంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం పై అన్ని ఫ్రాంఛైజీలు అప్పుడే దృష్టి సారించాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ వంటి జట్లు ట్రేడ్ డీల్స్‌ను ఖరారు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం, ముఖ్యంగా కావ్య మారన్ కూడా తమ కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

Kavya Maran : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం పై అన్ని ఫ్రాంఛైజీలు అప్పుడే దృష్టి సారించాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ వంటి జట్లు ట్రేడ్ డీల్స్‌ను ఖరారు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం, ముఖ్యంగా కావ్య మారన్ కూడా తమ కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మహ్మద్ షమీ లాంటి స్టార్ ప్లేయర్ జట్టును వీడనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో సన్‌రైజర్స్ బలం, భవిష్యత్తు కోసం ఆమె ఏడుగురు ఆటగాళ్లను అస్సలు వదులుకోకూడదో, జట్టుకు ప్రాణంగా ఉన్న ఆ ముగ్గురు కీలక ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు వివరంగా చూద్దాం.
స్థానిక యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతిపెద్ద ఆశాకిరణం. అతడిని జట్టు అట్టిపెట్టుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అభిషేక్ 2019 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతోనే ఉన్నాడు. 2024 సీజన్‌లో తన తుఫాన్ బ్యాటింగ్ తో జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గత రెండు సీజన్లలో అతను సన్‌రైజర్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో రెండవ స్థానంలో నిలిచాడు.
ఫ్రాంచైజీ అభిషేక్‌పై 7 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టింది. దీని ఫలితం గత రెండు సీజన్లలో స్పష్టంగా కనిపించింది. అతని విధ్వంసకర బ్యాటింగ్ స్టైల్ జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. అభిషేక్ శర్మతో అతని ఓపెనింగ్ జోడీ సన్‌రైజర్స్ విజయాలకు పునాదిగా నిలిచింది.
గత రెండు సంవత్సరాలలో హెడ్, అభిషేక్ కలిసి ఏకంగా 1864 పరుగులు జోడించారు. ఈ పార్ట్‌నర్‌షిప్ జట్టు అదృష్టాన్ని పూర్తిగా మార్చింది. హెడ్ 2024 సీజన్‌లో అత్యధిక పరుగులు (567) చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్. అతను తన దూకుడు ఆరంభాలతో టీమ్‌కు మంచి ఊపునిచ్చాడు. అందుకే ఈ అద్భుతమైన ఓపెనింగ్ జోడీని కావ్య మారన్ విడదీయాలని అస్సలు కోరుకోరు.
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరిగా పేరుగాంచిన ప్యాట్ కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వెలకట్టలేని ఆస్తి. కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కమిన్స్ నాయకత్వంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 2024 సీజన్‌లో ఫైనల్ వరకు చేరుకుంది. మైదానంలో అతని అసాధారణమైన నిర్ణయాలు, వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి.
కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు, బౌలర్‌గా కూడా అతను జట్టుకు కీలకమైనవాడు. గత రెండు సీజన్లలో కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం మొత్తం 34 వికెట్లు పడగొట్టాడు. ఒక విజయవంతమైన కెప్టెన్-బౌలర్‌గా అతడిని ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకోవడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




