BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ నుంచి ఆ ఇద్దరు ఆటగాళ్లు ఔట్‌.. కోట్ల రూపాయల కోత..

BCCI Contract: బీసీసీఐ టీమ్ ఇండియా కొత్త ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించింది. ఇందులో చాలామంది ఆటగాళ్లకి కోత విధించింది. మరికొంతమంది గ్రేడ్‌ ఏ నుంచి

BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ నుంచి ఆ ఇద్దరు ఆటగాళ్లు ఔట్‌.. కోట్ల రూపాయల కోత..
Bcci
Follow us

|

Updated on: Mar 03, 2022 | 3:25 PM

BCCI Contract: బీసీసీఐ టీమ్ ఇండియా కొత్త ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించింది. ఇందులో చాలామంది ఆటగాళ్లకి కోత విధించింది. మరికొంతమంది గ్రేడ్‌ ఏ నుంచి సి కి డిమోట్‌ చేసింది. కానీ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం అసలు కాంట్రాక్ట్‌లోనే లేకుండా పోయారు. వారు ఎవరంటే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ. ఇప్పడు వీరిద్దరు బీసీసీఐ కాంట్రాక్ట్‌లో భాగం కాదు. దీంతో కోట్లరూపాయలని నష్టపోతున్నారు. వాస్తవానికి బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా చోటు కల్పిస్తారు. కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలు ఇద్దరూ మునుపటి BCCI కాంట్రాక్ట్ ప్రకారం గ్రూప్ C గ్రేడ్ ప్లేయర్‌లు. కానీ కొత్త ఒప్పందంలో ఇప్పుడు ఇద్దరి పేర్లను తొలగించారు. దీని వల్ల ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్లకు బోర్డు నుంచి ఎటువంటి ప్రయోజనం పొందలేరు. బీసీసీఐ ఒప్పందం ప్రకారం ఏ+ ఆటగాళ్లకు ఏటా రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ.5 కోట్లు లభిస్తాయి. గ్రేడ్-బి, సి ఆటగాళ్లు వరుసగా రూ. 3 కోట్లు, రూ.1 కోటి పొందుతారు.

కొత్త ఒప్పందంలో 27 మంది ఆటగాళ్లు

భారత క్రికెట్ బోర్డు తన గత కాంట్రాక్ట్‌లో 28 మంది క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ఇవ్వగా ఈసారి కేవలం 27 మంది క్రికెటర్లకు మాత్రమే సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ఇచ్చింది. కొత్త కాంట్రాక్ట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ‘ఎ+’లో కొనసాగుతున్నారు. గతంలో ఏ గ్రేడ్‌లో ఉన్న పుజారా, రహానే, ఇషాంత్ శర్మ పేలవ ఫామ్‌ కారణంగా గ్రేడ్‌బీకి మారారు. ఈ ఆటగాళ్లని టెస్టు జట్టు నుంచి తప్పించారు. గత కాంట్రాక్టులో గ్రేడ్ ఎలో 10 మంది ఆటగాళ్లు ఉండగా ఈసారి ఐదుగురికి తగ్గించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, రిషబ్‌ పంత్‌, లోకేష్‌ రాహుల్‌, మహ్మద్‌ షమీ గ్రేడ్‌ ఏలో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. సాహా కూడా డిమోట్ చేయబడి గ్రూప్ B నుంచి Cకి వచ్చాడు.

Shikhar Dhawan: శిఖర్‌ ధావన్‌కి షాకిచ్చిన బీసీసీఐ.. గ్రేడ్‌ A నుంచి Cకి డిమోషన్..

Snake Bite: పాము కాటేస్తే ఏం చేయాలి.. ఆపద సమయంలో ఇలా చేయండి..

రాత్రిపూట ఈ పండు తింటే ఆ ట్యాబ్లెట్‌ అవసరమే ఉండదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..