Shikhar Dhawan: శిఖర్ ధావన్‌కి షాకిచ్చిన బీసీసీఐ.. గ్రేడ్ A నుంచి Cకి డిమోషన్..
Shikhar Dhawan: టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ శిఖర్ ధావన్‌కి బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. గ్రేడ్ ఏ నుంచి సికి డిమోషన్ చేసింది. కొత్త కాంట్రాక్ట్‌లో దాదాపు రూ.4 కోట్లు నష్టపోతున్నాడు.
Shikhar Dhawan: టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ శిఖర్ ధావన్‌కి బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. గ్రేడ్ ఏ నుంచి సికి డిమోషన్ చేసింది. కొత్త కాంట్రాక్ట్‌లో దాదాపు రూ.4 కోట్లు నష్టపోతున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈసారి 27 మంది ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పేర్లలో శిఖర్ ధావన్ కూడా ఉంది. కానీ గతేడాదితో పోలిస్తే ఈసారి ఆయనకు భారీగా కోత పడింది. అతని గ్రేడ్‌లో మార్పు కారణంగా ఇది జరిగింది. పాత ఒప్పందంలో శిఖర్ ధావన్ 10 మంది ఆటగాళ్లతో కలిపి గ్రూప్ A లో ఉంచారు. అయితే ఈసారి గ్రూప్ ఏ గ్రేడ్‌లో కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఇందులో శిఖర్ ధావన్ పేరు లేదు. బీసీసీఐ ధావన్‌ని డిమోట్ చేసి గ్రూప్ ఏ నుంచి నేరుగా గ్రూప్ సీకి చేర్చింది.
బీసీసీఐ ఒప్పందం ప్రకారం గ్రూప్-ఎలో చేరిన ఆటగాళ్లకు ఏటా రూ.5 కోట్లు లభిస్తాయి. అదే సమయంలో గ్రూప్ సి గ్రేడ్ ఉన్న ఆటగాళ్లకు కోటి రూపాయలు ఇస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో శిఖర్ ధావన్ మునుపటి ఒప్పందంతో పోలిస్తే కొత్త ఒప్పందం ప్రకారం బోర్డు నుంచి ఏటా రూ.4 కోట్లు తక్కువగా పొందుతాడు. శిఖర్ ధావన్‌తో పాటు మరో భారత ఆటగాడు కూడా ఇలాంటి పరాజయాన్ని చవిచూశాడు. అతడి పేరు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. గాయం కారణంగా క్రికెట్‌కు దూరం కావడం వల్ల బోర్డు నుంచి వచ్చే అతని వార్షిక ఆదాయానికి పెద్ద కత్తెర పడింది. కొత్త కాంట్రాక్ట్‌లో బీసీసీఐ హార్దిక్‌ని డిమోట్ చేసి గ్రూప్‌సిలో చేర్చింది. మునుపటి కాంట్రాక్ట్‌లో అతను కూడా ధావన్‌లాగే గ్రూప్-ఎలో ఉన్నాడు.
చివరి టెస్టు 2018లో ఆడాడు..
కొత్త బిసిసిఐ కాంట్రాక్ట్‌లో ధావన్ భారీ నష్టానికి ప్రధాన కారణం. అతడు చాలాకాలం పాటు టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉండటం. వాస్తవానికి శిఖర్ ధావన్ 2018 సంవత్సరం నుంచి టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వచ్చిన తర్వాత ఈ ఫార్మాట్‌లో ఆడడం కష్టంగా మారింది. కాగా రెడ్ బాల్ క్రికెట్‌లో అతని గణాంకాలను పరిశీలిస్తే అతను టాప్ క్లాస్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 34 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలతో సహా 41 సగటుతో 2300 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.