Chennai Mayor: చెన్నైకు తొలి దళిత మహిళా మేయర్‌.. సీఎం బాటలోనే నడుస్తానంటూ ప్రకటన

Chennai first Dalit woman mayor: తమినాడు(Tamilanadu)లోని అధికార పార్టీ డీఎంకే(DMK)కు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఆర్ ప్రియ(R. Priya) చెన్నై మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి దళిత మహిళ రికార్డ్..

Chennai Mayor: చెన్నైకు తొలి దళిత మహిళా మేయర్‌.. సీఎం బాటలోనే నడుస్తానంటూ ప్రకటన
Meet R Priya, Chennai's Fir
Follow us
Surya Kala

|

Updated on: Mar 03, 2022 | 2:11 PM

Chennai first Dalit woman mayor: తమినాడు(Tamilanadu)లోని అధికార పార్టీ డీఎంకే(DMK)కు చెందిన ఇరవై తొమ్మిదేళ్ల ఆర్ ప్రియ(R. Priya) చెన్నై మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి దళిత మహిళ రికార్డ్ సృష్టిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇక్కడ మేయర్ పదవిని షెడ్యూల్డ్ కులాల మహిళకు రిజర్వ్ చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది. దీంతో తారా చెరియన్ , కామాక్షి జయరామన్ తర్వాత ప్రియా చెన్నైకి మూడవ మహిళా మేయర్ గా పదవిని చేపట్టనున్నారు. చెన్నై కార్పొరేషన్‌లో కౌన్సిలర్ పదవిని గెలుచుకున్న అనేక మంది యువ అభ్యర్థులలో ప్రియ కూడా ఒకరు. తమిళనాడులోని DMK మిత్రపక్షమైన CPI(M)కి చెందిన ప్రియదర్శిని (21) పిన్నవయస్కురాలు. తీనాంపేట 98వ వార్డు నుంచి ప్రియదర్శిని గెలుపొందారు. డిఎంకె మార్చి 3 వ తేదీ గురువారం పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రియా అని ప్రకటించింది. ఇక చెన్నై కార్పొరేషన్‌లో డిఎంకెకు మెజారిటీ ఉన్నందున.. ప్రియ త్వరలో మేయర్‌గా అధికారికంగా ఎన్నికకానున్నారు.

ప్రియా 74వ వార్డు, మంగళపురం కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతేకాదు ప్రియ ఉత్తర చెన్నై నుంచి ఎంపికైన మొదటి మేయర్ గా కూడా రికార్డ్ సృష్టించారు. ఈ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉందని..  రౌడీయిజం , హింస ఎక్కువగా ఉన్న ప్రదేశంగా చాలా తరచుగా తమిళ సినిమాల్లో చిత్రీకరిస్తారు. వాస్తవానికి.. ఈ మంగళాపురం ఉత్తర చెన్నై పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ ప్రాథమిక మౌలిక సదుపాయాలకు చాలా దూరంగా ఉంటుంది. తాగునీరు నుండి విద్యుత్, పారిశుధ్యం వరకు అనేక సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు యువ కౌన్సిలర్‌ను మేయర్‌గా నియమించడం స్వాగతించదగినదని పలువురు స్తానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కౌన్సిలర్‌గా, ప్రియాకు ఇది మొదటి అధికారిక పదవి.  అయితే ఆమె 18 సంవత్సరాల వయస్సు నుండి పార్టీ క్యాడర్‌గా పనిచేస్తున్నారు. అన్నాదురై, కరుణానిధి, ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా ద్రావిడ నాయకుల ఫోటోలు ఇంటిలోని గోడలకు వేలాడుతూ కనిపిస్తాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడంతో తనకు రాజకీయాలపై ఆసక్తి, పొరుగువారికి సహాయం చేయాలనే మక్కువ ఎక్కువైందని ప్రియా చెప్పింది. “సీఎం వైవిధ్యం కోసం ప్రయత్నిస్తుండడం తాను గమనించినట్లు చెప్పారు. తాను కూడా సీఎం పాలనలో భాగం కావాలని కోరుకున్నానని.. చెప్పారు. తాను ఎంపికైన పరిసరాలలో అనేక సమస్యలు ఉన్నాయి. రానున్న రోజుల్లో తాగు నీటి సమస్య తీర్చాలని..    రోడ్లను మెరుగుపరచాలి. విద్యుత్ సమస్యలను తీర్చాలని ప్రియా చెప్పారు.

ప్రియా తండ్రి ఆర్ రాజన్ డిఎంకెకు ఏరియా కో-సెక్రటరీ. జార్జ్ టౌన్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ & కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఎం కామ్ పట్టా పుచ్చుకున్నారు. విద్యార్థిగా కాలేజీ రోజుల్లో రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు. దీనికి కారణం  మీ కుటుంబ నేపథ్యం అని ఎవరైనా అడిగితే  ప్రియ నవ్వుతూ.. లేదు తనకు తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని అనిపించిందని తెలిపారు. అంతేకాదు యువత రాజకీయాల్లోకి రావడం చాలా ముఖ్యం అని కూడా  చెప్పారు. “వారికి కొత్త ఆలోచనలు, కొత్త శక్తి ఉంటుందని అన్నారు. ప్రియా ఇప్పడు తమ వార్డుకి కౌన్సిలర్‌గా ఎంపిక కావడంతో మార్పు వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రియా విజయంతో మంగళాపురం పరిసర ప్రాంతాలు మారుతాయని భావిస్తున్నారు.

Also Read:  మనదేశంలో అందమైన ప్రకృతి, వన్యప్రాణులకు నెలవు ఈ 5 ప్రదేశాలు..(photo gallery)