- Telugu News Photo Gallery World Wildlife Day 2022: Top 5 Tourist Places to Enjoy Nature and Wildlife in India
World Wildlife Day 2022: మనదేశంలో అందమైన ప్రకృతి, వన్యప్రాణులకు నెలవు ఈ 5 ప్రదేశాలు..
World Wildlife Day 202: నేడు వన్యప్రాణి దినోత్సవం.. ప్రపంచవ్యాప్తంగా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా జరుపుకుంటాము. భూమి అనేక రకాల వృక్షజాతిని, జంతుజాలాన్ని కలిగి ఉంది. భారత దేశం వైవిధ్యమైన ప్రకృతికి నిలయం. ఇక్కడ వైవిధ్యమైన వన్యప్రాణులను వీక్షించవచ్చు. ఈ రోజు మనదేశంలోని ప్రకృతి, వన్యప్రాణులను కలిగిన 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం
Updated on: Mar 03, 2022 | 1:44 PM

రంతంబోరే నేషనల్ పార్క్: రాజస్థాన్ లోని రంతంబోరే ఉన్న వన్య సంరక్షణ పార్క్. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల నెలవు. సాహస యాత్రను ఇష్టపడిన వారు ఈ పార్క్ ను సందర్శించవచ్చు. సఫారీల థ్రిల్‌ను ఆస్వాదించవచ్చు. అంతేకాదు ఈ వన్యప్రాణుల సంరక్షణ పార్కు ఒకప్పుడు మహారాజులకు ఇష్టమైన వేట ప్రదేశంగా ఉండేది.

జిమ్ కోర్బెట్ నేషనల్ పార్క్: నైనిటాల్ పర్వత జిల్లా ఒడిలో ఉన్న ఈ జిమ్ కోర్బెట్ నేషనల్ పార్క్ అనేక రకాల వన్యప్రాణులను కలిగి ఉంది. ముఖ్యంగా పులుల రక్షణ కోసం ఎంపికైన మొదటి టైగర్ జోన్. ఇక్కడ తెల్ల పులులు సందడి చేస్తాయి. పులులు మాత్రమే కాదు మచ్చల జింకలు, ఏనుగులు, బంగారు నక్కలు, సాంబార్ జింకలను కూడా చూడవచ్చు. ఇక కోసి నది, కార్బెట్ జలపాతం అందాలను ఆస్వాదించవచ్చు.

కజిరంగా నేషనల్ పార్క్: అస్సాంలో ఉన్న ఈ కన్జర్వేషన్ పార్క్ ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. దేశంలోని అత్యుత్తమ వన్యప్రాణి అభయారణ్యాలలో ఒకటి. చిత్తడి జింకలు, అడవి నీటి గేదెలకు నిలయం. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు 2/3వ వంతు భాగం ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ తేయాకు తోటలు, వాచ్‌టవర్ల అందాలను కూడా ఆస్వాదించవచ్చు.

కోయినా వన్యప్రాణుల అభయారణ్యం: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం అత్యంత సుందరమైనది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన అత్యంత అందమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో ఇది ఒకటి. పచ్చని అభయారణ్యం కింగ్ కోబ్రాస్, రాయల్ బెంగాల్ టైగర్స్ , వివిధ రకాల పక్షులకు కేంద్రంగా ఉంది.

కారకోరం వన్యప్రాణుల అభయారణ్యం: జమ్మూకశ్మీర్‌లోని పర్వత ప్రాంతాలలో ఉన్న గొప్ప జీవవైవిధ్యం కలిగిన అభయారణ్యం కారకోరం. ఇక్కడ మీరు టిబెటన్ జింక, అడవి దున్నపోతులను, మంచు చిరుతపులులు, ఎర్ర నక్కలు, తోడేళ్ళు వంటి జంతువులను చూడవచ్చు




