IND vs WI: ప్రేక్షకులు లేకుండానే భారత్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌లు.. కానీ వారికి మాత్రం అనుమతి..?

IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ కూడా ప్రేక్షకులు లేకుండానే జరుగుతుంది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు.

IND vs WI: ప్రేక్షకులు లేకుండానే భారత్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌లు.. కానీ వారికి మాత్రం అనుమతి..?
India West Indies
Follow us
uppula Raju

|

Updated on: Feb 04, 2022 | 4:59 PM

IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ కూడా ప్రేక్షకులు లేకుండానే జరుగుతుంది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. మూడు టీ20ల సిరీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరగనుంది. బెంగాల్ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించి స్టేడియంలో 75 శాతం ప్రేక్షకుల హాజరును ఆమోదించింది. కానీ భారత క్రికెట్ బోర్డు మాత్రం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు. దీనికి ముందు జరిగే వన్డే సిరీస్ కూడా ప్రేక్షకులు లేకుండానే జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వన్డే సిరీస్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

సౌరవ్ గంగూలీ కోల్‌కతాలో ప్రేక్షకుల ప్రవేశం గురించిన ప్రశ్నపై ‘నేను రికార్డ్‌లో చెబుతున్నాను. మూడు టీ20 మ్యాచ్‌లకు ఈడెన్ గార్డెన్స్‌లో ప్రేక్షకులను అనుమతించడం లేదు. ప్రజలకు టిక్కెట్లు విక్రయించడం లేదు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు, వివిధ యూనిట్ల ప్రతినిధులకు మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రేక్షకులను అనుమతి ఇచ్చి ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం. బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఉన్నప్పటికీ టికెట్లు విక్రయించడం కుదరదు. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం బీసీసీఐకి ఇష్టం లేదు’ అని స్పష్టం చేశాడు.

ఫిబ్రవరి 16 నుంచి టీ20 సిరీస్

ఫిబ్రవరి 16 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి ముందు ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు వన్డే సిరీస్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే వెస్టిండీస్ జట్టు భారత్ చేరుకుంది. అదే సమయంలో భారత ఆటగాళ్లు కూడా అహ్మదాబాద్‌లో చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే టీమ్ ఇండియాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు ఆటగాళ్లే కాకుండాసహాయక సిబ్బంది కూడా కరోనా బారినపడ్డారు.

కరోనా పాజిటివ్‌గా గుర్తించిన ఆటగాళ్ల పేర్లలో శిఖర్ ధావన్, రితురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. వీరితో పాటు ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కూడా పాజిటివ్‌గా ఉన్నారు. అయితే ఈ సిరీస్‌ షెడ్యూల్‌లో బీసీసీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. కరోనా కేసులు బయటపడిన తర్వాత వారి స్థానంలో మయాంక్ అగర్వాల్, ఇషాన్ కిషన్‌, ఇతరులు జట్టులోకి వచ్చారు.

Viral Video: ఖడ్గమృగాన్ని కౌగిలించుకున్న యువతి.. రియాక్షన్‌ ఎలా ఉందంటే..?

Beauty Tips: అందమైన పాదాల కోసం ఐదు పద్దతులు.. పార్లర్‌ అవసరమే లేదు..?

Baby Bump: ఈ మహిళ బేబీ బంప్‌ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. సోషల్‌ మీడియాలో వైరల్‌..?