Sourav Ganguly: కోహ్లీ తర్వాత రోహిత్‌ను కెప్టెన్ చేసింది అందుకే.. అసలు విషయం చెప్పేసిన గంగూలీ

2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. అయితే మొదట్లో బోర్డు నిర్ణయం రోహిత్‌కు నచ్చలేదు. అయితే రోహిత్‌ను ఒప్పించడంలో గంగూలీ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ విషయాన్ని గతంలో గంగూలీనే స్వయంగా చెప్పాడు.

Sourav Ganguly: కోహ్లీ తర్వాత రోహిత్‌ను కెప్టెన్ చేసింది అందుకే.. అసలు విషయం చెప్పేసిన గంగూలీ
Sourav Ganguly

Updated on: Mar 01, 2024 | 5:30 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్నఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా. అలాగే, స్వదేశంలో అజేయంగా కొనసాగుతోన్న భారత్‌ జట్టుకు ఇది 17వ టెస్టు సిరీస్ విజయం. దీంతో స్వదేశంలో అత్యధిక టెస్టు సిరీస్‌లు గెలిచిన జట్ల జాబితాలో టీమ్‌ఇండియా ఇప్పుడు 2వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. టీమిండియాను విజయపథంలో నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మపై భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో కోహ్లి తర్వాత రోహిత్‌కి కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారో గంగూలీ వెల్లడించాడు. వాస్తవానికి, 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. అయితే మొదట్లో బోర్డు నిర్ణయం రోహిత్‌కు నచ్చలేదు. అయితే రోహిత్‌ను ఒప్పించడంలో గంగూలీ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఈ విషయాన్ని గతంలో గంగూలీనే స్వయంగా చెప్పాడు. చారిత్రాత్మక టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత రోహిత్‌ని కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేశారో మరోసారి వెల్లడించాడు గంగూలీ.

‘రోహిత్ శర్మలోని ప్రతిభను చూసి అతనిని కెప్టెన్‌గా ఎంపిక చేశాను. ప్రపంచకప్‌లో అతను జట్టును నడిపించిన తీరు అద్భుతం. అతని నాయకత్వంలో జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్‌లో ఓడిపోయినా వరల్డ్‌కప్‌లో భారత్‌ అత్యుత్తమ జట్టుగా భావిస్తున్నాను. రోహిత్ నిజంగా గొప్ప కెప్టెన్. కెప్టెన్‌గా కూడా ఎన్నో ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌ పై సిరీస్ విజయం నన్నేమీ ఆశ్చర్యపర్చలేదు’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇక ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించడంపై గంగూలీ స్పందించాడు. ‘BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ పరిధిలో ఉన్న ప్రతి ఆటగాడు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాలి. ఇది భారతదేశంలో క్రికెట్ ప్రాథమిక నిర్మాణం. రంజీల్లో ఇషాన్, శ్రేయస్ అయ్యర్‌ ఆడకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇది ఒక ముఖ్యమైన టోర్నమెంట్. అందరూ ఇందులో ఆడాలి. ఈ విషయంలో బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది’అని గంగూలీ తెలిపాడు.

ఇంగ్లండ్ తో ఐదో టెస్టుకు భారత జట్టు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.