AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana: మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

Smriti Mandhana: దుబాయ్ వేదికగా హాంకాంగ్ తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన బౌండరీల సునామీ సృష్టించింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన మంధాన, కేవలం 57 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకుంది.

Smriti Mandhana: మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు.. సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Smriti Mandhana
Rakesh
|

Updated on: Sep 03, 2026 | 10:03 PM

Share

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆసియా కప్ 2026 పోటీల్లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన హాంకాంగ్‌పై విధ్వంసకర సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక అంతర్జాతీయ పరుగుల ఆల్‌టైమ్ రికార్డును అధిగమించి, మహిళల క్రికెట్‌లో అగ్రపీఠాన్ని కైవసంచేసుకుని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగరేసింది.

దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన బౌండరీల సునామీ సృష్టించింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన మంధాన, కేవలం 57 బంతుల్లోనే తన సెంచరీ మార్కును అందుకుంది. ఈ క్రమంలో 14 ఫోర్లు, 7 మైండ్ బ్లోయింగ్ సిక్సర్లతో విరుచుకుపడి 124 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె విధ్వంసకర బ్యాటింగ్ దెబ్బకు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరును సాధించింది.

ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ద్వారా మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 333 మ్యాచ్‌ల్లో చేసిన 10,868 పరుగుల రికార్డే అగ్రస్థానంలో ఉండేది. మంధాన కేవలం 302 మ్యాచ్‌ల్లోనే 10,880 పరుగులు సాధించి మిథాలీని అధిగమించింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సుజీ బేట్స్ (10,740), ఇంగ్లండ్ దిగ్గజం షార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273) వరుసగా తదుపరి స్థానాల్లో ఉన్నారు.

ఈ అద్భుత సెంచరీతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు సెంచరీలు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో 2025లో ఇంగ్లండ్‌పై ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఆమె తన తొలి టి20 సెంచరీ (112) సాధించింది. భారత కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ 2018లో సాధించిన ఒకే ఒక్క సెంచరీ రికార్డును మంధాన ఇప్పటికే అధిగమించగా, ఇప్పుడు రెండు సెంచరీలతో సరికొత్త మైలురాయిని చేరుకుంది.

స్మృతి మంధాన విధ్వంసానికి తోడు భారత బ్యాటర్లు రన్ రేట్ పెంచడంతో హాంకాంగ్ బౌలర్లు తీవ్ర ఒత్తిడిలో పడిపోయారు. హాంకాంగ్ బౌలర్లలో మెరీనా లాంప్లో రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్, తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడేందుకు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
గోధుమ రంగు గుడ్లు అంటే దేశీయ గుడ్లేనా? ఎక్కువ ధర పెట్టేముందు..
గోధుమ రంగు గుడ్లు అంటే దేశీయ గుడ్లేనా? ఎక్కువ ధర పెట్టేముందు..
మొండి కొండా.. ఫైర్‌బ్రాండ్ ఫ్యామిలీ వివాదాలతో జర్నీ!
మొండి కొండా.. ఫైర్‌బ్రాండ్ ఫ్యామిలీ వివాదాలతో జర్నీ!
రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు నిజం ఇదే..
రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు నిజం ఇదే..
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
రూ.79,999కే Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్క ఛార్జ్‌తో 301కి.మీ
రూ.79,999కే Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్క ఛార్జ్‌తో 301కి.మీ
నమ్మశక్యం కాని ఫీచర్లతో Mivi డ్యుయోపాడ్స్‌.. వివరాలివే
నమ్మశక్యం కాని ఫీచర్లతో Mivi డ్యుయోపాడ్స్‌.. వివరాలివే
జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి..
జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి..
జిమ్‌లో వ్యాయామంచేస్తూ.. యువతకు అకస్మాత్తుగా గుండెపోటు! కారణం ఇదే
జిమ్‌లో వ్యాయామంచేస్తూ.. యువతకు అకస్మాత్తుగా గుండెపోటు! కారణం ఇదే