AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొండి కొండా.. ఫైర్‌బ్రాండ్ ఫ్యామిలీ వివాదాలతో జర్నీ! అత్యుత్సాహమా.. ఆత్మాభిమానమా?

కొండా సురేఖ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ వివాదాలు, సవాళ్లతోనే సాగింది. పలు పార్టీల మార్పులు, మంత్రి పదవుల త్యాగాలు, ప్రత్యర్థులతో ఢీకొన్న సందర్భాలు ఆమెను ఫైర్‌బ్రాండ్ నేతగా నిలబెట్టాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో విభేదాల నేపథ్యంలో కేబినెట్‌ నుంచి తొలగింపు రాజకీయంగా కీలక మలుపైంది.

మొండి కొండా.. ఫైర్‌బ్రాండ్ ఫ్యామిలీ వివాదాలతో జర్నీ! అత్యుత్సాహమా.. ఆత్మాభిమానమా?
Konda Surekha And Konda Murali
SN Pasha
|

Updated on: Sep 03, 2026 | 9:58 PM

Share

రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయ్.. అని ఏజోల్డ్ డైలాగ్ ఒకటుంది. అంటే, ఎవ్వరి పతనాన్ని వాళ్లే డిసైడ్ చేసుకుంటారని అర్థం కాబోలు. ఆమాటకొస్తే, తెలంగాణ ఫైర్‌బ్రాండ్ కొండా సురేఖ ఇటువంటి ఆత్మహత్యలు లెక్కలేనన్నిసార్లు చేసుకున్నారు. కానీ, పతనమైనట్టే అయ్యి, మళ్లీ పీక్స్‌కి చేరడాన్ని మేనరిజమ్‌గా మార్చుకుంటారు. పార్టీలు మారినా పవర్‌సెంటర్ మారదు. పదవుల కోసం పోరాడినా, మాటపట్టింపులతో ఆ పదవుల్ని కాలదన్నుకున్నా.. అన్నీ ఆమెకే చెల్లు. టచ్‌ చేసి చూడు రేంజ్‌లో ఉంటుంది కొండా ఫ్యామిలీ స్పీడు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రితోనే ఢీకొట్టి, హైకమాండ్‌ బుర్రల్ని వేడెక్కించి, గాంధీభవన్‌ బైటికొచ్చి నిలబడ్డారు. సొంత పాపులారిటీల కంటే, కాంట్రవర్సీలే పెట్టుబడిగా ఎదిగి, కటౌట్‌ సైజుల్ని పెంచుకున్న కొండా ఫ్యామిలీకి వాట్ నెక్స్ట్? మరోసారి పొలిటికల్ చౌరస్తాలో వచ్చి నిలబడ్డ కొండాను ఏ పార్టీ స్వాగతిస్తుంది? ఇవన్నీ అటుంచితే, శాపమో వరమో తెలీని కొండా గతం గురించైతే మాట్లాడుకునే తీరాలి. ఎందుకంటే, ఇదొక పవర్‌ఫుర్ కమర్షియల్ అండ్ క్రేజీ స్టోరీ కనుక. బర్తరఫ్ చెయ్యడానికి ముందురోజు ఢిల్లీలో ఖర్గేని కలిసొచ్చిన తర్వాత కొండా సురేఖ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ ఇది. సంజాయిషీ ఇచ్చినట్టే ఇచ్చి సాకిరేవు పెట్టినట్టే ఉంది. నన్ను తప్పిస్తే మీకే ముప్పు జర జూస్కోండి మరి.. అని హైకమాండ్‌కే స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు తాజా మాజీ మంత్రి కొండా సురేఖ. అవసరాన్ని బట్టి ఎప్పుడు ఏ కార్డు బైటికి తియ్యాలో అదే తీసి.. షోను తన...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి