AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ కీ మెంబర్స్! ఎవరు ఎటువైపు అంటే..?

2027 వన్డే ప్రపంచకప్ కోసం రోహిత్ శర్మను కొనసాగించాలా, యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలా అనే అంశంపై చర్చ జరిగినట్లు రిపోర్టులు వెల్లడించాయి. గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ జైస్వాల్‌కు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. అయితే వీవీఎస్ లక్ష్మణ్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, బీసీసీఐ అధ్యక్షుడు దేవజిత్ సైకియా రోహిత్‌కు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది.

రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ కీ మెంబర్స్! ఎవరు ఎటువైపు అంటే..?
Bcci Meeting
SN Pasha
|

Updated on: Sep 03, 2026 | 5:46 PM

Share

తాజాగా బీసీసీఐ ఒక కీలక సమావేశం నిర్వహించింది. ఇటీవలె జట్టు ప్రదర్శనతో పాటు 2027 వన్డే వరల్డ్ కప్‌కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఈ మీటింగ్ జరిగింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వన్డే, టెస్ట్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అలాగే సెలెక్షన్ కమిటీ సభ్యులు ఆర్పీ సింగ్, ఓజా కూడా పాల్గొన్నారు.

అయితే ఈ మీటింగ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కూర్పుపై టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రోహిత్ శర్మను జట్టులో కొనసాగించాలా? లేక యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు అవకాశం కల్పించాలా? అనే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

జైస్వాల్‌కు గంభీర్, అగార్కర్ మద్దతు?

రిపోర్టుల ప్రకారం.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో యశస్వి జైస్వాల్‌ను చేర్చాలని భావించినట్లు సమాచారం. ఇందుకోసం రోహిత్ శర్మ స్థానంలో జైస్వాల్‌ను తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం, భవిష్యత్ జట్టు నిర్మాణంపై దృష్టి పెట్టడం ఇందులో ప్రధాన కారణాలుగా ఉన్నట్లు సమాచారం.

రోహిత్‌కు లెజెండరీ మద్దతు

అయితే మరోవైపు భారత మాజీ క్రికెటర్, క్రికెట్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. 2027 ప్రపంచకప్‌లో రోహిత్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం భారత్‌కు ప్రయోజనం కలిగిస్తుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మకు ఉన్న అంతర్జాతీయ అనుభవం, పెద్ద టోర్నమెంట్లలో ఒత్తిడిని ఎదుర్కొన్న తీరు, కీలక మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన జట్టుకు ఉపయోగపడుతుందని భావించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞుల కలయిక అవసరమని వారు సూచించినట్లు తెలుస్తోంది.

రిటైర్మెంట్ నిర్ణయం రోహిత్‌దే

అయితే రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు ఎప్పుడు వీడ్కోలు పలకాలి అనే నిర్ణయం పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయమేనని సమాచారం. ప్రస్తుతం 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్‌కు మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో భారత క్రికెట్‌లో రోహిత్ భవిష్యత్తుపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రోహిత్ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీ ఆడాలా? వద్దా? అనే విషయంపై ఇలా బీసీసీఐ, ఇండియన్ క్రికెట్‌లో కీ మెంబర్స్‌గా ఉన్న వాళ్లు ఇలా రెండు భిన్న అభిప్రాయాలతో రెండుగా విడిపోవడం ఆసక్తికరంగా మారింది.

Follow Us