AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemons Buying: ఇన్నాళ్లు పొరపాటు చేశారేమో.. ఇకపై ఇలాంటి నిమ్మకాయలను అస్సలు కొనకండి!

నిమ్మకాయలు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. వీటిని వంటకాల్లో, పానియాల్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇందులో మన బాడీకి అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి. అయితే వీటిని కొనే విషయంలో చేసే కొన్ని తప్పుల కారణంగా మనం వాటి సరైన ప్రయోజనాలను పొందలేము. అంతేకాదు డబ్బులు కూడా లాస్ అవుతాము. కాబట్టి నిమ్మకాయలు కొనేటప్పుడు ఏ విషయాలపై శ్రద్ధ పెట్టాలో చూద్దాం.

Lemons Buying: ఇన్నాళ్లు పొరపాటు చేశారేమో.. ఇకపై ఇలాంటి నిమ్మకాయలను అస్సలు కొనకండి!
Lemons Buying Tips
Anand T
|

Updated on: Sep 03, 2026 | 5:29 PM

Share

చాలా మంది మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఒకేసారి ఎక్కవగా నిమ్మకాలయను కొనుకొస్తుంటారు. అయితే వాటిలో కొన్ని సార్లు రసం తక్కువగా ఉందని, తొక్క మందంగా ఉందని ఇంటికి వాటిని వాడేటప్పుడు గుర్తిస్తాం. కానీ కొనేటప్పుడు మనం కొన్ని చిట్కాలు పాటిస్తే నిండుగా రసం ఉన్న మంచి నిమ్మకాయలను ఈజీగా గుర్తించవచ్చు. కాబట్టి మార్కెట్‌లో నిమ్మకాయలు కొనేటప్పుడు వేటిపై శ్రద్ధ వహించాలో చూద్దాం.

నిమ్మకాయలు కొనేటప్పుడు ఇవి గుర్తించుకోండి

బరువును: మీరు చేతిలో పట్టుకున్నప్పుడు నిమ్మకాయ దాని సైజు కంటే బరువుగా అనిపిస్తే, దానిలో రసం ఎక్కువగా ఉందని అర్థం.ఎండిన, రసం లేని నిమ్మకాయలు పరిమాణంలో పెద్దవిగా ఉండవచ్చు కానీ బరువు చాలా తక్కువగా ఉంటుంది. మీరు జ్యూస్ కోసం నిమ్మకాయలు కొంటే ఎప్పుడు ఇలాంటి వాటినే కొనండి.

తొక్క మందం: నిమ్మకాయ తొక్క ఎక్కవ మందంగా ఉన్నా, కాస్త గరుకుగా అనిపించినా అలాంటి వాటిలో రసం తక్కువగా ఉందని అర్థం. ఎప్పుడూ పలుచని, నునుపైన తొక్క ఉన్న నిమ్మకాయల్లోనే రసం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఈ సారి కొనేటప్పుడు తొక్కను చూడడం మర్చిపోకండి.

నొక్కి చూడడం: మీ కొనేటప్పుడు వేళ్లతో నిమ్మకాయను మెల్లగా నొక్కి చూడండి. అలా నొక్కినప్పుడు మెత్తగా, మృదువుగా ఉండే నిమ్మకాయల్లో రసం ఎక్కువగా ఉంటుందని అర్థం. ఒక వేళ నిమ్మకాయ గట్టిగా ఉండి, నొక్కడానికి వీలుకాకపోతే అందులో రసం తక్కువగా ఉందని అర్థం.

రంగు, ఆకారం: ప్రకాశవంతమైన, ముదురు పసుపు రంగులో ఉండే నిమ్మకాయల్లో రసం ఎక్కువగా ఉంటుంది. అదే ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయలు పుల్లగా ,తక్కువ రసంతో ఉంటాయి. అయితే చాలా మంది పెద్దగా ఉన్న నిమ్మకాయల్లో రసం ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. కానీ వాటిలో తొక్క మాత్రమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ బరువు బట్టే నిమ్మకాయను కొనండి.

నిమ్మకాయ పాడైపోయిందని ఎలా తెలుసుకోవాలి?

మీరు కొనే నిమ్మకాయలు ఫ్రెష్‌గా ఉన్నాయా లేదా అనేది ఇలా గుర్తుంచుకోండి.. నిమ్మకాయ బయట ఆకుపచ్చ లేదా తెల్లటి పొడిలాంటి మచ్చలు కనిపిస్తే, అది పాడైపోయిందని అర్థం, అలాగే నిమ్మకాయపై పెద్ద గోధుమ లేదా నల్లటి మెత్తటి మచ్చలు ఉంటే అవి కుళ్లిపోయాయని అర్థం.అలాంటి వాటిని మీరు ఎప్పుడూ కొనకండి. ఈ సారి మార్కెట్‌కు వెల్లినప్పుడు ఇవి గుర్తించుకోండి.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us