AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: “బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్

TOP 9 ET News: “బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్

Phani CH
|

Updated on: Sep 03, 2026 | 3:16 PM

Share

పవన్ కళ్యాణ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పారు ప్రధాని మోది. అయితే ఈసారి కేవలం విషెస్ చెప్పి ఆగిపోలేదు! పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తిగా మోదీ తన ట్వీట్లో అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో NDA ప్రభుత్వం చేపడుతున్న సుపరిపాలనకు మరింత ఊపునిచ్చే విషయంలో పవన్ కీలకంగా ఉన్నారంటూ ప్రశంసించారు. అంతేకాదు… సమాజ సేవలో పవన్ మరింత కాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మోదీ ట్వీట్‌పై పవన్ కూడా స్పందించారు. మోదీ మాటలకి.. బ్లెస్సింగ్స్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పారు. మీరిచ్చిన ఈ ఎంకరేజ్‌ మెంట్‌తో ఏపీని మరింతగా ముందుకుగా తీసుకెళతా అంటూ పవన్‌ ట్వీట్ చేశారు.

‘You have always been a great source of inspiration to me’ అంటూ తనకు పవన్ ఎప్పుడూ స్ఫూర్తి అని చెప్పాడు. ఆరోగ్యం, ఆనందం, మరెన్నో అద్భుతమైన సంవత్సరాలను పవన్‌ చూడాలని ఆకాంక్షించాడు చరణ్. కానీ చివర్లో ఒక్క మాటతో చరణ్ మెగా ఫ్యాన్స్‌ను టచ్ చేశాడు.‘Love you, Babai’ అంటూ తన ట్వీట్‌లో కోట్ చేశాడు. దాంతో పాటే లవ్‌ ఎమోజీని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చరణ్ మాత్రమే కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్‌ను విష్ చేస్తూ ట్వీట్ చేశాడు. Many Happy Returns of the day to Power Star Pawan Kalyan garu’అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు #OGPowerStar అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను బన్నీ తన ట్వీట్‌లో కోట్ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాకినాడలో లవ్‌ జీహాద్‌ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం

“జలం… జీవం – జీవితం! ఆకట్టుకుంటున్న సీఎం చంద్రబాబు పోస్ట్

దుమ్మురేపేలా పవన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. సీఎం చంద్రబాబు ప్రత్యేక శుభాకాంక్షలు

అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్‌లైన్‌లోనే పెద్దల ఆశీస్సులు!

వెయ్యి రోజుల పాలన.. ఫ్రీగా ఉల్లిగడ్డల పంపిణీ! వరంగల్‌లో కాంగ్రెస్ నేత వినూత్న సంబరాలు!

Follow Us