SL vs IND: శ్రీలంకతో ఆఖరి టీ20 ..క్లీన్ స్వీప్‌పై టీమిండియా కన్ను.. తుది జట్టులో ఏకంగా 4 మార్పులు

భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ మంగళవారం (జులై 29) పల్లెకెలె వేదికగా ప్రారంభమైంది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఇప్పుడు చివరి మ్యాచ్ లోనూ గెలిచి ఆతిథ్య శ్రీలంక జట్టును వైట్ వాష్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

SL vs IND: శ్రీలంకతో ఆఖరి టీ20 ..క్లీన్ స్వీప్‌పై టీమిండియా కన్ను.. తుది జట్టులో ఏకంగా 4 మార్పులు
India Vs Srilanka
Follow us

|

Updated on: Jul 30, 2024 | 8:24 PM

భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ మంగళవారం (జులై 29) పల్లెకెలె వేదికగా ప్రారంభమైంది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఇప్పుడు చివరి మ్యాచ్ లోనూ గెలిచి ఆతిథ్య శ్రీలంక జట్టును వైట్ వాష్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు స్వదేశంలో క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుని, పరువు దక్కించుకోవాలనే పట్టుదలతో శ్రీలంక జట్టు బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పాటు ఇరు జట్లలోని 11 మంది ప్లేయింగ్‌లు కూడా బయటకు వచ్చాయి. దీని ప్రకారం శ్రీలంక జట్టులో 1 మార్పు, భారత జట్టులో 4 మార్పులు జరిగాయి. పైన చెప్పినట్లుగా, టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో నాలుగు మార్పులు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్‌లకు విశ్రాంతినిచ్చింది. వీరి స్థానంలో శుభమన్ గిల్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలకు అవకాశం కల్పించారు.

మరోవైపు శ్రీలంక తరఫున చమిందు విక్రమసింఘే అరంగేట్రం చేశాడు. శ్రీలంక తరఫున టీ20లో అరంగేట్రం చేసిన 108వ ఆటగాడిగా చమిందు నిలిచాడు. చమిందుకి తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య క్యాప్ ఇచ్చి అభినందించారు. దాసున్ షనక స్థానంలో చమిందుకి అవకాశం కల్పించారు.

ఇవి కూడా చదవండి

రెండు జట్లు

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్ మరియు ఖలీల్ అహ్మద్.

శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్:

చరిత్ అస్లాంక (కెప్టెన్), పాతుమ్ నిశాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహిష్ తీక్షణ, మతిషా పతిరనా మరియు అసిత ఫెర్నాండో.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..