Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL vs AFG: లంకలో విధ్వంసం.. 2 పరుగులతో సెంచరీ మిస్.. కట్‌చేస్తే.. టీమిండియా ఫ్యూచర్ స్టార్‌ రికార్డ్‌కు బ్రేకులు..

Ibrahim Zadran: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్ 269 పరుగుల లక్ష్యాన్ని 46.5 ఓవర్లలోనే సాధించింది. ఇబ్రహీం జద్రాన్ 98 బంతుల్లో 98 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

SL vs AFG: లంకలో విధ్వంసం.. 2 పరుగులతో సెంచరీ మిస్.. కట్‌చేస్తే.. టీమిండియా ఫ్యూచర్ స్టార్‌ రికార్డ్‌కు బ్రేకులు..
Ibrahim Zadran Sl Vs Afg
Follow us
Venkata Chari

|

Updated on: Jun 03, 2023 | 11:59 AM

ఐపీఎల్ సీజన్ ముగియడంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులందరి దృష్టి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌పైకి మళ్లింది. జూన్ 2న శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ప్రారంభమైంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్ 21 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ అద్భుత ప్రదర్శనతో 98 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. జద్రాన్ తన ఇన్నింగ్స్ ఆధారంగా భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్ వన్డే రికార్డును బద్దలు కొట్టాడు.

2019 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఇబ్రహీం జద్రాన్.. 2022 సంవత్సరంలో నేరుగా ఈ ఫార్మాట్‌లో తన రెండవ మ్యాచ్‌ను ఆడే అవకాశాన్ని పొందాడు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో జద్రాన్ 120 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తరువాత నవంబర్ 2022 నెలలో, జద్రాన్ శ్రీలంక పర్యటనలో 3 ODIలలో 106, 162 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.

అదే సమయంలో, జద్రాన్ ఈ శ్రీలంక పర్యటనను 98 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రారంభించాడు. దీంతో జద్రాన్ ఇప్పుడు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ విషయంలో 7 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన దక్షిణాఫ్రికా ఆటగాడు జానెమన్ మలన్ మొదటి స్థానంలో ఉన్నాడు. మరోవైపు, శుభ్‌మన్ గిల్ 10 ఇన్నింగ్స్‌లలో తన 500 వన్డే పరుగులను పూర్తి చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇబ్రహీం జద్రాన్ ఇప్పటివరకు 9 వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరపున 66.25 సగటుతో మొత్తం 530 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 3 సెంచరీలు, 1 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఇది కాకుండా, జద్రాన్ ఇప్పటివరకు 22 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 27.78 సగటుతో 500 పరుగులు చేశాడు.

వన్డేల్లో ఉమ్మడి రెండో అత్యధిక స్కోరు సాధించిన ఆఫ్ఘనిస్తాన్..

తొలి వన్డేలో 269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ 46.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేదించింది. దీంతో వన్డే క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ రెండో ఉమ్మడి అత్యధిక స్కోరు సాధించింది. 2014లో యూఏఈపై ఆఫ్ఘన్ జట్టు 276 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..