Suryakumar Yadav : ఇక నువ్వు సర్దేసుకోవడం బెటర్ భయ్యా.. సోషల్ మీడియాలో సూర్యను ఆడుకుంటున్న నెటిజన్స్
Suryakumar Yadav : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డానిష్ మలేవార్ (2), క్వింటన్ డికాక్ (13) త్వరగానే అవుట్ అయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, జట్టును ఆదుకుంటాడని అందరూ ఆశించారు.

Suryakumar Yadav : ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అతని ఫామ్ ముంబై జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సూర్య తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గతంలో అసాధ్యమైన షాట్లతో అలరించిన సూర్య, ఇప్పుడు కనీసం క్రీజులో నిలబడలేకపోతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
మళ్ళీ నిరాశపరిచిన సూర్య
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డానిష్ మలేవార్ (2), క్వింటన్ డికాక్ (13) త్వరగానే అవుట్ అయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, జట్టును ఆదుకుంటాడని అందరూ ఆశించారు. కానీ కగిసో రబడా వేసిన ఇన్ స్వింగర్ కు సూర్య దగ్గర సమాధానం లేకపోయింది. కేవలం 15 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ముంబై 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గత సీజన్‌లో 774 పరుగులు చేసిన సూర్య, ఈసారి మాత్రం అస్సలు ప్రభావం చూపలేకపోతున్నాడు.
Suryakumar Yadav should focus on cricket than outside activities. High time MI should drop him #GTvMI
— Gappebaaz (@BazzBalle) April 20, 2026
Hi Mumbai Indians,
Please Drop Suryakumar Yadav. pic.twitter.com/j5ERiX8Xgh
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) April 20, 2026
సీజన్ అంతా ఇదే తిప్పలు
ఐపీఎల్ 2026లో సూర్య ఆటతీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కోల్‌కతాపై 16 పరుగులు, ఢిల్లీపై 51 పరుగులు (ఒకే ఒక్క హాఫ్ సెంచరీ), రాజస్థాన్‌పై 6 పరుగులు, బెంగళూరుపై 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్ (సున్నా) అవుట్ అయ్యాడు. ఇప్పుడు గుజరాత్‌పై 15 పరుగులకే పరిమితమయ్యాడు. ఒక మ్యాచ్‌లో ఆడితే.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో ఫెయిల్ అవ్వడం అతనికి అలవాటుగా మారింది. దీనివల్ల ముంబై మిడిలార్డర్ పై ఒత్తిడి పెరిగి టీమ్ స్కోర్ కుంటుపడుతోంది.
Dear @mipaltan First you should play one or two matches against a team like Namibia and Netherlands so that Suryakumar yadav can get back into form. pic.twitter.com/wxyJvdDssq
— vivek (@vivekpall) April 20, 2026
అభిమానుల ఆగ్రహం
సూర్య వరుస వైఫల్యాల నేపథ్యంలో X వేదికగా అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ ప్రైమ్ టైమ్ అయిపోయిందని, అతను తన పాత ఫామ్ కు నీడలా మారాడని కామెంట్స్ చేస్తున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్య ఆటతీరు పూర్తిగా మారిపోయిందని, జట్టు మేనేజ్మెంట్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లేదా రజత్ పాటిదార్ వంటి ఆటగాళ్ల వైపు చూడాలని నెటిజన్లు సూచిస్తున్నారు. సూర్యను తుది జట్టు నుంచి తప్పించి యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Time is running out for Suryakumar Yadav, but I doubt if this current team management will move on from him as a T20I captain.
On the other hand, players like Shreyas and Rajat are performing both as player and Captain.
— Aditya Saha (@Adityakrsaha) April 20, 2026
గతేడాది గణాంకాలు కూడా దారుణం
కేవలం ఐపీఎల్‌లోనే కాదు, 2025లో భారత జట్టు తరపున ఆడినప్పుడు కూడా సూర్య గణాంకాలు దారుణంగా ఉన్నాయి. 22 మ్యాచ్‌ల్లో కేవలం 13.62 సగటుతో 218 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో కూడా 30 సగటుతో 242 పరుగులు చేసినా.. సూర్య రేంజ్ కి అవి చాలా తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ముంబై కోచ్ మహేల జయవర్ధనే మాత్రం ఈ ఓటములకు ఒక్క వ్యక్తిని బాధ్యుడిని చేయలేమని చెప్పినా, కీలక ఆటగాడైన సూర్య వైఫల్యం జట్టును దెబ్బతీస్తోందనేది నగ్న సత్యం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
