AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. కట్ చేస్తే.. బ్యాంక్ ఉద్యోగిగా టీమిండియా బౌలర్..

Siddarth Kaul: ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ ఇటీవలే అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. IPL-2025 వేలంలో విక్రయించబడకపోవడంతో సిద్ధార్థ్ కౌల్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే అతనికి కొత్త ఉద్యోగం వచ్చింది.

ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. కట్ చేస్తే.. బ్యాంక్ ఉద్యోగిగా టీమిండియా బౌలర్..
Siddarth Kaul
Velpula Bharath Rao
|

Updated on: Dec 03, 2024 | 8:47 PM

Share

విరాట్ కోహ్లీ సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ ఇటీవలే అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. IPL-2025 వేలంలో విక్రయించబడకపోవడంతో సిద్ధార్థ్ కౌల్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే అతనికి కొత్త ఉద్యోగం వచ్చింది. సిద్ధార్థ్ ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నట్లు తెలిపాడు. సిద్థార్థ్  తన X హ్యాండిల్‌లో ఇప్పుడు కొత్త ఉద్యోగంలో కనిపిస్తాను అని ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు. 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియాలో సిద్ధార్థ్ సభ్యుడు ఉన్నాడు. భారత్ తరఫున మూడు వన్డేలు, టీ20లు కూడా ఆడాడు. అయితే అతని అంతర్జాతీయ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. అతను వెంటనే జట్టు నుండి తొలగించబడ్డాడు.

పదవి విరమణ చేసిన కొద్ది రోజులకే, సిద్ధార్థ్ కొత్త అవతారం ఎత్తాడు. ఆఫీస్ టైమ్ అని రాసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో, సిద్ధార్థ్ క్రీమ్ కలర్ షర్ట్ ధరించి, అద్దాలు ధరించి తన కారులో కూర్చున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటి.. ఆ బ్యాంక్‌లో సిద్ధార్థ్ పని చేస్తున్నాడు. అతను చండీగఢ్‌లోని సెక్టార్-17 బ్రాంచ్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అతను 2017 నుండి ఈ బ్యాంకులో భాగమయ్యాడు. కానీ క్రికెట్ కారణంగా ఉద్యోగం చేయలేకపోయాడు. కానీ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడంతో మళ్లీ బ్యాంక‌కు వెళ్తున్నాడు.

సిద్ధార్థ్ ఈసారి ఐపీఎల్‌లో అమ్ముడుపోలేదు. కానీ అతకు ముందు లీగ్‌లో కొనసాగాడు. గతంలో న్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్‌ తరఫున ఆడాడు. సిద్ధార్థ్ పంజాబ్ తరఫున 88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 297 వికెట్లు తీశాడు. అంతే కాకుండా, అతను 111 లిస్ట్ A మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 199 వికెట్లు తీసుకున్నాడు. 145 టీ20 మ్యాచ్‌లు ఆడి 182 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి