AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. అతనొస్తున్నాడు..!

బెంగుళూరులో టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఘోర పరాభవం చూసింది. అయితే తుదపరి మ్యాచ్‌లకు శుభ్‌మాన్ గిల్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది. తాజాగా అతను మైదానంలో ప్రాక్టిస్ చేస్తున్న ఫోటోలు నెటింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

IND vs NZ: టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. అతనొస్తున్నాడు..!
Shubman Gill
Velpula Bharath Rao
|

Updated on: Oct 20, 2024 | 6:06 PM

Share

గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సెంచరీ చేసిన టీమిండియా ప్లేయర్ శుభ్‌మాన్ గిల్ బెంగుళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన ఓపెనింగ్ టెస్టులో ఆడాలని భావించాడు. కానీ అనూహ్యంగా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైయ్యాడు. గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌‌ను టీమిండియా తీసుకున్నారు. గత నెలలో బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో 150 పరుగులు చేసి ఔట్ అయిన తర్వాత సర్ఫరాజ్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ, న్యూజిలాండ్ ప్రారంభ సెషన్‌లోనే 107 పరుగుల ఛేదనను ముగించడంతో, గిల్ మైదానంలో కనిపించాడు. ఈ సందర్భంగా గిల్ ప్రాక్టిస్ మొదలు పెట్టాడు. ఫాస్ట్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ మయాంక్ యాదవ్‌లు బౌలింగ్ చేశారు. పూణేలో జరగనున్న రెండో టెస్టు కోసం గిల్ జట్టులోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే తదుపరి మ్యాచ్‌లో గిల్‌కి స్థానం కల్పిస్తే ఎవరిని పక్కకు పెడుతారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ సీరిస్‌లో కేఎల్ రాహుల్ సరిగా ఆడకపోవడంతో అతని స్థానంలో గిల్‌ను తీసుకుంటామని పలువురు అంచనా వేస్తున్నారు. సర్ఫరాజ్‌ ఖాన్‌ న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ సీరిస్‌లో 150 పరుగులు చేయడంతో అతన్ని ప్లేస్‌కు ఎలాంటి ఢోకా ఉండదని అని తెలుస్తుంది.

ప్రాక్టస్ చేస్తున్న ఫోటోలు ఇదిగో:

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి