AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer: ధోని, కోహ్లీ, రోహిత్‌ వల్లే కాలేదు.. కానీ అయ్యర్‌ సాధించాడు! భారత క్రికెట్‌ చరిత్రలో తొలి కెప్టెన్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 68 పరుగులు చేసి, ఇంగ్లాండ్ గడ్డపై హాఫ్‌ సెంచరీ సాధించిన తొలి భారత టీ20 కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

Shreyas Iyer: ధోని, కోహ్లీ, రోహిత్‌ వల్లే కాలేదు.. కానీ అయ్యర్‌ సాధించాడు! భారత క్రికెట్‌ చరిత్రలో తొలి కెప్టెన్‌
Shreyas Iyer
SN Pasha
|

Updated on: Jul 02, 2026 | 6:25 AM

Share

చెస్టర్‌-లె-స్ట్రీట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చి జట్టును ఆదుకోవడమే కాకుండా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 6 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్‌ 47 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 68 పరుగులు చేసి టీమ్‌ను ఆదుకున్నాడు. అయ్యర్‌ ఇన్నింగ్స్‌ టీ20 క్రికెట్‌కు సరిపోనట్లు కనిపిస్తున్న మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు ఆడాడు.

ఇది కూడా చదవండి: వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్.. ఏమన్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అయితే ఈ ఇన్నింగ్స్‌తో అయ్యర్‌ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై హాఫ్‌ సెంచరీ చేసిన తొలి భారత టీ20 కెప్టెన్‌ కొత్త చరిత్ర లిఖించాడు. గతంలో టీమిండియాకు హేమాహేమీ కెప్టెన్లుకు చెప్పుకునే మహేంద్ర సింగ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మకు కూడా ఈ రికార్డును క్రియేట్‌ చేయలేకపోవడం గమనార్హం. మొత్తంగా టీ20 కెప్టెన్‌గా తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన అపఖ్యాతి మూటగట్టుకున్న అయ్యర్‌.. మూడో మ్యాచ్‌లో మాత్రం బతికున్నంత కాలం చెప్పుకునే రికార్డు సాధించాడు.

ఇది కూడా చదవండి: హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులు, అయ్యర్‌ 68, చివర్లో శివమ్‌ దూబే 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి టీమిండియా మంచి స్కోర్‌ అందించారు. అయితే టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసింది. ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు దిగలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం
ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు బిగ్ సర్‌‌ప్రైజ్‌
ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు బిగ్ సర్‌‌ప్రైజ్‌
జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ రిస్క్ తప్పదు!
జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ రిస్క్ తప్పదు!
ఈ టాలీవుడ్ డైరెక్టర్‌కు ఆకలి విలువ బాగా తెలుసు.. తన ఆఫీసులోనే...
ఈ టాలీవుడ్ డైరెక్టర్‌కు ఆకలి విలువ బాగా తెలుసు.. తన ఆఫీసులోనే...
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్
అధునాతన ఫీచర్లతో సరికొత్త రెడ్‌మీ కే 100 ప్రో విశేషాలు
అధునాతన ఫీచర్లతో సరికొత్త రెడ్‌మీ కే 100 ప్రో విశేషాలు
ఎలక్ట్రిక్ బైక్స్ రంగంలోకి హీరో మోటోకార్ప్​.. లాంచ్ ఎప్పుడంటే
ఎలక్ట్రిక్ బైక్స్ రంగంలోకి హీరో మోటోకార్ప్​.. లాంచ్ ఎప్పుడంటే
ముఖం తెల్లగా.. మెడ నల్లగా ఉందా?.. ఈ తేడా పోవాలంటే ఇలా చేయండి!
ముఖం తెల్లగా.. మెడ నల్లగా ఉందా?.. ఈ తేడా పోవాలంటే ఇలా చేయండి!
ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..
ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..
సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణయాగం వరకు.. లెక్కలివే
సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణయాగం వరకు.. లెక్కలివే