AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం..ఈ టాలీవుడ్ రూటే సపరేట్ గురూ..!

నిన్నమొన్నటివరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు .

పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం..ఈ టాలీవుడ్ రూటే సపరేట్ గురూ..!
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 10, 2026 | 8:43 PM

Share

ప్రేమలు, పెళ్లి, విడాకులు అనేవి సమాజంలో కామన్ గా మారిపోయాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్ గా ఇవి వినిపిస్తూనే ఉంటాయి. సినీ సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పడం కష్టంగా మారిపోతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా బ్రేకప్స్‌తో, రిలేషన్ షిప్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.  ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రెటీలు విడాకులు అనౌన్స్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో ఆరు సినిమాలే చేసింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. నటనతోనే కాదు అందంలోనూ ఈ అమ్మడు అప్సరసే.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన నటించింది.

కానీ ఇప్పుడు ఊహించని విధంగా టాలీవుడ్ కు దూరం అయ్యింది. ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లాడింది. కానీ వీరికాపురం కొన్నాళ్లే నిలబడింది. మూడేళ్లకే మొగుడికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకొని పిల్లాడిని కూడా కనేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు అందాల భామ అమలాపాల్. తెలుగులో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన బెజవాడ సినిమాతో అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఆ సినిమా తర్వాత సిద్దార్థ్ తో చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలా పాల్. రామ్ చరణ్ సరసన నాయక్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి ఆ తర్వాత తెలుగులో అనుకున్నంతగా ఆఫర్స్ రాలేదు. నానితో చేసిన జెండాపై కపిరాజు సినిమా వచ్చివెళ్లిన విషయం కూడా చాలా మందికి తెలియదు. అలాగే పిట్ట కథలు అనే సినిమా చేసింది. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాల పైనే ద్రుష్టి పెట్టింది. అయితే 2014 తమిళ్ దర్శకుడు ఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత 2017లో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె నటుడు జగత్‌ దేశాయ్‌ను 2023 నవంబర్ 5న వివాహం చేసుకుంది. వీరికి ఓ బిడ్డకూడా జన్మించింది.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం
పెళ్లైన మూడేళ్లకే విడాకులు.. మరొకరితో ప్రేమాయణం
ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు బిగ్ సర్‌‌ప్రైజ్‌
ఫోల్డబుల్ ఫోన్ ప్రియులకు బిగ్ సర్‌‌ప్రైజ్‌
జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ రిస్క్ తప్పదు!
జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ రిస్క్ తప్పదు!
ఈ టాలీవుడ్ డైరెక్టర్‌కు ఆకలి విలువ బాగా తెలుసు.. తన ఆఫీసులోనే...
ఈ టాలీవుడ్ డైరెక్టర్‌కు ఆకలి విలువ బాగా తెలుసు.. తన ఆఫీసులోనే...
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్
కుక్కగా మారడానికి కోట్లు ఖర్చుపెట్టిన కోటిశ్వరుడు! వీడియో వైరల్
అధునాతన ఫీచర్లతో సరికొత్త రెడ్‌మీ కే 100 ప్రో విశేషాలు
అధునాతన ఫీచర్లతో సరికొత్త రెడ్‌మీ కే 100 ప్రో విశేషాలు
ఎలక్ట్రిక్ బైక్స్ రంగంలోకి హీరో మోటోకార్ప్​.. లాంచ్ ఎప్పుడంటే
ఎలక్ట్రిక్ బైక్స్ రంగంలోకి హీరో మోటోకార్ప్​.. లాంచ్ ఎప్పుడంటే
ముఖం తెల్లగా.. మెడ నల్లగా ఉందా?.. ఈ తేడా పోవాలంటే ఇలా చేయండి!
ముఖం తెల్లగా.. మెడ నల్లగా ఉందా?.. ఈ తేడా పోవాలంటే ఇలా చేయండి!
ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..
ధనవంతులు ఎక్కువగా డబ్బును ఇన్వెస్ట్‌ చేసేది ఇక్కడే..
సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణయాగం వరకు.. లెక్కలివే
సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణయాగం వరకు.. లెక్కలివే