AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్.. ఏమన్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య T20 సిరీస్ ప్రారంభం కానుండగా, వైభవ్ సూర్యవంశీ డెబ్యూ కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ అరంగేట్రం చేయకముందే ఇంగ్లాండ్ జట్టు అతని పట్ల వ్యూహాలు రచిస్తుండటం విశేషం. సచిన్, కోహ్లీ లాంటి స్టార్లకు మాత్రమే జరిగే ఈ ప్రత్యేకత, వైభవ్ విషయంలో డెబ్యూకు ముందే జరగడం అతని అసాధారణ ప్రతిభకు నిదర్శనం.

IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..  ఏమన్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Harry Brook And Vaibhav Sur
SN Pasha
|

Updated on: Jul 01, 2026 | 4:19 PM

Share

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ నేటితో మొదలవనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోసం కంటే చాలా మంది ఎదురుచూస్తోంది ఓ కుర్రాడి డెబ్యూ కోసం. ఎస్.. మీరు ఊహించింది నిజమే.. వైభవ్ సూర్యవంశీ డెబ్యూ కోసం కోట్ల మంది క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడూ ఈ బుడ్డోడి అంతర్జాతీయ అరంగేట్రం చూడాలని ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో వైభవ్‌ను ఆడించనందుకు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కనీసం ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లోనైనా వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని అంతా కోరుకుంటున్నారు. మరి వైభవ్ తొలి మ్యాచ్‌తోనే డెబ్యూ చేస్తాడా? లేదా? అన్నది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేతుల్లో ఉంది. ఆ విషయం పక్కనపెడితే.. వైభవ్ సూర్యవంశీ ఇంకా డెబ్యూ చేయకముందే.. అతను ఇంగ్లాండ్ జట్టును భయపెడుతున్నట్లు అర్థం అవుతుంది. అందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాటలే కారణం.

ఇది కూడా చదవండి: హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?

టీ20 సిరీస్‌కి ముందు మీడియాతో మాట్లాడిన బ్రూక్.. వైభవ్ సూర్యవంశీ ఆటను ఏడాది, ఏడాదిన్నర కాలంగా చూస్తున్నాం, చాలా టాలెంటెడ్ ప్లేయర్, అయితే అతని కోసం కొన్ని వ్యూహ్యాలు రచించాం, అవి పనిచేస్తాయని భావిస్తున్నాం అంటూ పేర్కొన్నాడు. అంటే ఇంకా కనీసం ఇంటర్నేషనల్ డెబ్యూ చేయని ప్లేయర్ గురించి, ప్రత్యర్థి జట్టు ప్రత్యేకంగా వ్యూహాలు రచించడం అంటే మామూలు విషయం కాదు. గతంలో టీమిండియాతో మ్యాచ్ అంటే సచిన్ టెండూల్కర్‌ని ఏ విధంగా అవుట్ చేయాలని ఒక ప్రత్యేక ప్లాన్‌తో ప్రత్యర్థి జట్లు వచ్చేవి, ఆ తర్వాత విరాట్ కోహ్లీ విషయంలో అలా జరిగేది. కానీ వాళ్లిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి, స్టార్ ప్లేయర్లుగా ఎదిగిన తర్వాత జరిగిన సీన్లు.. వైభవ్ విషయంలో ఇంకా డెబ్యూ చేయకముందే జరగడం విశేషం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us