Video: విజయానికి 6 బంతుల్లో 24 పరుగులు.. 8వ స్థానంలో వచ్చి ఇరగదీసిన అనామకుడు..
Shivamogga Lions beat Mysore Warriors in Mharaja Trophy T20 League: మహారాజా ట్రోఫీ మ్యాచ్‌లో, శివమోగ లయన్స్ జట్టు మైసూర్ వారియర్స్‌ను ఉత్కంఠభరితంగా ఓడించింది. లయన్స్ విజయానికి హీరో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు.

Shivamogga Lions beat Mysore Warriors in Mharaja Trophy T20: ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి కర్ణాటక, కేరళ వరకు టీ20 లీగ్‌లో చాలా అద్భుత ప్రదర్శనలు కనిపించాయి. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలే కాకుండా, ఉత్తేజకరమైన మ్యాచ్‌లు కూడా అభిమానులను ఎంతగానో అలరించాయి. చివరి బంతికి ముగిసిన కొన్ని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. కర్ణాటకలోని మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లో అలాంటి ఒక మ్యాచ్ జరిగింది. దీనిలో శివమోగ లయన్స్ చివరి ఓవర్లో అవినాష్ డి అద్భుతమైన బ్యాటింగ్ ఆధారంగా మైసూర్ వారియర్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. అవినాష్ చివరి ఓవర్‌లో అద్భుతమైన సిక్సర్‌తో ముగించాడు.
మహారాజా ట్రోఫీలో 28వ మ్యాచ్‌లో మైసూర్ ముందుగా బ్యాటింగ్ చేసి 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రతిస్పందనగా, అనిశ్వర్ గౌతమ్ (49, రోహిత్ కె (46) బ్యాడ్ ఆరంభం తర్వాత జట్టును ఆదుకున్నారు. 14వ ఓవర్‌లో బలమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును 108 పరుగులకు చేర్చారు. కానీ, ఈ స్కోరు సమయానికి ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ అవుట్ అయ్యారు. ఆరో వికెట్ కూడా ఇక్కడే పడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో, 8వ నంబర్ బ్యాట్స్‌మన్ అవినాష్ క్రీజులోకి ప్రవేశించాడు. అతను ఇన్నింగ్స్‌ను చేపట్టి జట్టును లక్ష్యానికి దగ్గరగా తీసుకువచ్చాడు.
అవినాష్ ఒంటి చేత్తో విజయం..
కానీ, చివరి ఓవర్లో లయన్స్ జట్టుకు 24 పరుగులు అవసరం కాగా, ఇంకా 3 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 8వ నంబర్ బ్యాట్స్‌మన్ అవినాష్, 9వ నంబర్ బ్యాట్స్‌మన్ భరత్ ధూరి క్రీజులో ఉన్నారు. చివరి ఓవర్లో అవినాష్ స్ట్రైక్‌లో ఉన్నాడు. కానీ, ఈ బ్యాటర్ 6 బంతులను స్వయంగా ఎదుర్కొని మ్యాచ్‌ను గెలిచాడు. అతను ఓవర్‌ను ఫోర్‌తో ప్రారంభించి, మరుసటి బంతికే సిక్స్ కొట్టాడు. తర్వాత మూడో బంతికి ఈ బ్యాట్స్‌మన్ మరో ఫోర్ కొట్టాడు.
అవినాష్ నాల్గవ, ఐదవ బంతుల్లో చెరో 2 పరుగులు చేశాడు. దీని కారణంగా చివరి బంతికి 6 పరుగులు అవసరం అయ్యాయి. కానీ, అవినాష్ తన కృషిని వృధా చేసుకోనివ్వలేదు. ఆరో బంతికి లాంగ్ సిక్స్ కొట్టడం ద్వారా జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అవినాష్ 21 బంతుల్లో 45 పరుగులు సాధించగా, ధూరి కూడా 9 పరుగులు సాధించాడు.
టెయిల్-ఎండర్లు కూడా మైసూర్ తరపున..
View this post on Instagram
అంతకుముందు, మైసూర్ ఓపెనర్ ఎస్ యు కార్తీక్ మంచి ఇన్నింగ్స్ ఆడి 34 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అతను జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు. అతనితో పాటు, ఏడో నంబర్ బ్యాట్స్‌మన్ హర్షిల్ ధర్మని కేవలం 16 బంతుల్లో అజేయంగా 37 పరుగులు, ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మన్ సాగర్ గౌతమ్ కేవలం 11 బంతుల్లో అజేయంగా 30 పరుగులు సాధించాడు. దీని కారణంగా జట్టు 180 పరుగుల బలమైన స్కోరును చేరుకోగలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








