సన్‌రైజర్స్‌పై చెన్నై సూపర్ విక్టరీ
చెన్నై : ఐపీఎల్ పోటీల్లో భాగంగా చిదంబరం స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విధించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది చెన్నై సూపర్ కింగ్స్. 3 పరుగులకే డుప్లిసిస్ వికెట్ కోల్పోయినా షేన్ వాట్సన్ అద్బుతంగా పోరాడి సూపర్ విక్టరీ అందించాడు. సురేశ్ రైనా 38 పరుగులు, అంబటిరాయుడు 21 పరుగులతో రాణించారు. వాట్సన్ 53 […]

చెన్నై : ఐపీఎల్ పోటీల్లో భాగంగా చిదంబరం స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విధించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది చెన్నై సూపర్ కింగ్స్. 3 పరుగులకే డుప్లిసిస్ వికెట్ కోల్పోయినా షేన్ వాట్సన్ అద్బుతంగా పోరాడి సూపర్ విక్టరీ అందించాడు. సురేశ్ రైనా 38 పరుగులు, అంబటిరాయుడు 21 పరుగులతో రాణించారు. వాట్సన్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 96 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. విజయానికి రెండు బంతుల్లో ఒక్క పరుగు కావాల్సిన దశలో అంబటి రాయుడు అవుట్ కావడంతో అంతా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్, తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సింగిల్ రాబట్టడంతో ఆతిథ్య జట్టు విజయాన్ని అందుకుంది. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్… ఈ సీజన్‌లో ఫ్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరు చేసింది. గత కొన్ని సీజన్లుగా ఘోరంగా విఫలమవుతూ వచ్చిన మనీశ్ పాండే… అద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయాడు. అతనికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ కూడా తోడు కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి స్కోరు నమోదుచేసింది. అయినా కూడా చెన్నై సూపర్ కింగ్స్‌లో రైనా, అంబటి, వాట్సన్ చెలరేగడంతో సన్ రైజర్స్ ఓటమిపాలయ్యింది.
It went down to the penultimate ball but @ShaneRWatson33‘s 96 ensured that @ChennaiIPL win at the Chepauk tonight!#CSKvSRH pic.twitter.com/j78gUnIBAn
— IndianPremierLeague (@IPL) April 23, 2019