AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ మ్యాచ్‌లు..చలో విశాఖ

విశాఖ వాసులను అనుకోకుండా అదృష్టం వరించింది.  ఐపీఎల్‌లో భాగంగా జరిగే రెండు కీలక ప్లే ఆఫ్ మ్యాచ్‌లను చూసే అవకాశం వారికి దక్కింది. మే 8, 10 తేదీల్లో విశాఖపట్నం వేదికగా రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగబోతున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అమరావతి వేదికగా ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఈ మ్యాచ్‌లు చెన్నైలో జరగాల్సి ఉన్నా.. చెపాక్ స్టేడియంలోని I, J, K స్టాండ్స్‌ని తెరిచేందుకు తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) అనుమతివ్వకపోవడంతో వేదికను హైదరాబాద్‌కు […]

ఐపీఎల్ మ్యాచ్‌లు..చలో విశాఖ
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2019 | 5:30 PM

Share

విశాఖ వాసులను అనుకోకుండా అదృష్టం వరించింది.  ఐపీఎల్‌లో భాగంగా జరిగే రెండు కీలక ప్లే ఆఫ్ మ్యాచ్‌లను చూసే అవకాశం వారికి దక్కింది. మే 8, 10 తేదీల్లో విశాఖపట్నం వేదికగా రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగబోతున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అమరావతి వేదికగా ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఈ మ్యాచ్‌లు చెన్నైలో జరగాల్సి ఉన్నా.. చెపాక్ స్టేడియంలోని I, J, K స్టాండ్స్‌ని తెరిచేందుకు తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) అనుమతివ్వకపోవడంతో వేదికను హైదరాబాద్‌కు మార్చారు.

అయితే మే 8, 10 తేదీల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌కు భద్రత కల్పించడం కష్టంగా మారింది. దీంతో ఈ రెండు మ్యాచ్‌లను విశాఖ వేదికకు మార్చారు. మే 8న ఎలిమినేటర్ మ్యాచ్, మే 10న క్వాలిఫయర్ మ్యాచ్ విశాఖలో జరగనున్నాయి. ఇటీవలే విశాఖ మైదానాన్ని ఐపీఎల్ అధికారులు సందర్శించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, మైదానం కండిషన్‌ను వారు పరిశీలించారు. అన్ని అనుకూలంగా ఉన్నాయని ఫిక్స్ అయ్యాకే విశాఖకు మ్యాచ్‌లను కేటాయించినట్టు సమాచారం. చివరిసారిగా 2016లో విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి.

Follow Us
గూగుల్ క్యాంపస్‌లో తాతయ్య సందడి! చిన్నప్పుడు ఆయన నేర్పారు,ఇప్పుడు
గూగుల్ క్యాంపస్‌లో తాతయ్య సందడి! చిన్నప్పుడు ఆయన నేర్పారు,ఇప్పుడు
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా..?
ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా..?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా? ఇలా చేస్తే చిటికెలో పెద్ద మంట
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా? ఇలా చేస్తే చిటికెలో పెద్ద మంట
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో బీర్ సేల్స్
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో బీర్ సేల్స్
రోబో మూవీ రిపీట్‌.. షో మధ్యలో యువతిని కౌగిలించుకుని హంగామా!
రోబో మూవీ రిపీట్‌.. షో మధ్యలో యువతిని కౌగిలించుకుని హంగామా!
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..