AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. షోరూమ్‌లో ఎగిసిపడ్డ మంటలు.. భయాందోళనలో ప్రజలు

హైదరాబాద్‌ అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహీంద్ర షోరూమ్‌లో చెలరేగిన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు భయాందోళన చెందారు.

Hyderabad: అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. షోరూమ్‌లో ఎగిసిపడ్డ మంటలు.. భయాందోళనలో ప్రజలు
Massive Fire Breaks Out At Mahindra Showroom
Krishna S
|

Updated on: Apr 27, 2026 | 4:41 PM

Share

హైదరాబాద్ అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్ర కార్ల షోరూమ్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే ఈ మంటలు షోరూమ్ అంతటా విస్తరించి భారీగా ఎగిసిపడ్డాయి. షోరూమ్ లోపల కొత్త వాహనాలు, విడిభాగాలు, ఆయిల్ వంటి మండే స్వభావం గల పదార్థాలు ఉండటంతో మంటలు అత్యంత వేగంగా వ్యాపించాయి. అగ్నిప్రమాదంతో  నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. కిలోమీటర్ల దూరం వరకు ఈ దట్టమైన పొగ కనిపిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం 4 నుండి 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. షోరూమ్ చుట్టుపక్కల జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పక్కనున్న ఇళ్లను సైతం ఖాళీ చేయిస్తున్నారు. అంబర్‌పేట ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో అటువైపుగా వెళ్లే వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

భారీగా నష్టం

షోరూమ్‌లో ఉన్న పలు కొత్త కార్లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో లోపల ఎంతమంది సిబ్బంది ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
గూగుల్ క్యాంపస్‌లో తాతయ్య సందడి! చిన్నప్పుడు ఆయన నేర్పారు,ఇప్పుడు
గూగుల్ క్యాంపస్‌లో తాతయ్య సందడి! చిన్నప్పుడు ఆయన నేర్పారు,ఇప్పుడు
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
LSG: ఎవర్రా మీరంతా.. లక్షలుపోసి కొంటే నట్టేట ముంచేస్తారా..?
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
నెలకు ఒక్కసారి ఒక్క గ్లాస్ చాలు.. తులసమ్మ ఎండాకాలంలోనూ గుబురుగా..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
బద్దకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 22 గంటల పాటు నిద్ర..
ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా..?
ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ నిర్మాణం ఎలా చేశారో తెలుసా..?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా? ఇలా చేస్తే చిటికెలో పెద్ద మంట
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా? ఇలా చేస్తే చిటికెలో పెద్ద మంట
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో బీర్ సేల్స్
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో బీర్ సేల్స్
రోబో మూవీ రిపీట్‌.. షో మధ్యలో యువతిని కౌగిలించుకుని హంగామా!
రోబో మూవీ రిపీట్‌.. షో మధ్యలో యువతిని కౌగిలించుకుని హంగామా!
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. షోరూమ్‌లో ఎగిసిపడ్డ మంటలు..
అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. షోరూమ్‌లో ఎగిసిపడ్డ మంటలు..