Video: భారీ భద్రత ఉన్నా.. కోహ్లీ కోసం మైదానంలో ఎంట్రీ ఇచ్చిన అభిమాని.. కట్‌చేస్తే..

IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంలో భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ అభిమాని మైదానంలోకి దిగి విరాట్ కోహ్లీ కాళ్లు పట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తుండగా క్రీజులోకి వచ్చిన ఓ అభిమాని అతని కాళ్లు పట్టుకున్నాడు.

Video: భారీ భద్రత ఉన్నా.. కోహ్లీ కోసం మైదానంలో ఎంట్రీ ఇచ్చిన అభిమాని.. కట్‌చేస్తే..
Kohli Fan Video
Follow us
Venkata Chari

|

Updated on: Mar 26, 2024 | 10:18 AM

Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2024 ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంలో భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ అభిమాని మైదానంలోకి దిగి విరాట్ కోహ్లీ కాలు పట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తుండగా క్రీజులోకి వచ్చిన ఓ అభిమాని అతని కాలు పట్టుకున్నాడు. భారీ భద్రత ఉన్నప్పటికీ, కోహ్లీ అభిమానులు మైదానంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పోలీసులు విచారిస్తున్నారు.

మైదానంలోకి దిగి కోహ్లీ కాలు పట్టుకున్న అభిమానిని విచారించగా అతడు రాయచూరుకు చెందిన మైనర్ అని తెలిసింది. రాయచూర్ నుంచి రైలులో వచ్చిన 17 ఏళ్ల మైనర్ రూ.3000 చెల్లించి డి బ్లాక్ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అతను విరాట్ కోహ్లీకి పిచ్చి అభిమాని.

ఇవి కూడా చదవండి

కోహ్లీ క్రీజులోకి వెళ్లాక ఏం జరిగింది?

పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కోహ్లీ, డుప్లెసిస్ క్రీజులోకి వెళ్తున్నారు. ఇంతలో ఆ యువకుడు రంగంలోకి దిగాడు. కోహ్లి క్రీజులోకి వెళుతుండగా వెనుక సీట్లో ఉన్నవాళ్లు ‘కోహ్లీని పట్టుకో’ అని అరుస్తున్నారని విచారణలో పోలీసులకు సమాచారం అందించాడు. అది వినగానే గ్రిల్ నుంచి దూకి రంగంలోకి దిగానని తెలిపాడు.

రాయచూర్‌కు చెందిన మైనర్‌పై కబ్బన్‌పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించడంతోపాటు మైదానంలోకి చొరబడినట్లు కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 49 బంతుల్లో 77 పరుగులు చేసి ఆర్సీబీ విజయానికి ఎంతగానో సహకరించాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 11 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. అంతకు ముందు ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో RCB 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాటు టోర్నీలో 2 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఒకదానిలో ఓడి, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?