Indian Test Team: దేశీవాళీ సంచలనానికి టీమిండియాలో నో చాన్స్.. స్వయంగా స్పందించిన యువ క్రికెటర్.. ఏమన్నాడంటే..?
Indian Test Team: టీమిండియా తన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ జూన్ 23న టెస్ట్, వన్డే సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించింది. టెస్ట్ సిరీస్ కోసం రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వంటి ఐపీఎల్..
Indian Test Team: టీమిండియా తన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ జూన్ 23న టెస్ట్, వన్డే సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించింది. టెస్ట్ సిరీస్ కోసం రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వంటి ఐపీఎల్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కి మరోసారి నిరాశే మిగిలింది. సర్ఫరాజ్‌ని ఎంపిక చేయకపోవడంపై ఇప్పటికే సునీల్ గవాస్కర్ వంటి క్రికెట్ దిగ్గజాలు కూడా బీసీసీఐపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే సర్ఫరాజ్ కూడా తనను ఎంపిక చేయకపోవడంపై స్పందించాడు.
దేశీవాళీ క్రికెట్‌లో తన సత్తా ఏమిటో తెలియజేసేలా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీని పోస్ట్ చేశాడు. అందులో పరుగుల వర్షం కురిపించిన సర్ఫరాజ్ ఆడిన ‘రంజీ ట్రోఫీ 2022-2023 ఇన్నింగ్స్’ కనిపిస్తుంది. నిలకడగా రాణిస్తున్న అతనికి బీసీసీఐ నిరాశనే మిగల్చడంపై అభిమానులు కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. గత సీజన్‌లో 9 ఇన్నింగ్స్‌లు ఆడిన సర్ఫరాజ్ 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు కూడా ఉండడం విశేషం. ఇవే కాక సర్ఫరాజ్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 37 మ్యాచ్‌లు ఆడి, 54 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. ఇందులో 79.65 సగటుతో 3505 పరుగులు.. ఇంకా 13 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్‌లో సర్ఫరాజ్ ఖాన్ పేరిట ట్రిపుల్ సెంచరీ కూడా ఉన్నప్పటికీ అతనికి నిరాశే మిగిలింది.
కాగా, వెస్టిండీస్ టూర్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో నలుగురు ఓపెనర్లు ఉన్నారు. ఈ మేరకు వారికి బదులుగా సర్ఫరాజ్ వంటి మిడిలార్డర్ బ్యాట్స్‌మ్యాన్ ఉంటే.. అదనంగా ఉపయోగపడేవారని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. దేశీయ క్రికెట్‌లో ఎంతో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ పేరటి ఉన్న మరో రికార్డ్ ఏమిటంటే.. ఆల్‌టైమ్ లెజెండరీ క్రికెటర్ అయిన డ్రాన్ బ్రాడ్ మ్యాన్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు(కనీసం 2000 రన్స్ చేసినవారిలో) మనోదిదే. బ్రాడ్‌మాన్ సగటు 95.14. కాగా సర్ఫరాజ్ సగటు 82.83.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..