AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Blast: 8 సింగిల్ డిజిట్ స్కోర్లు.. 100లోపే ఆలౌట్.. 4 వికెట్లతో దుమ్ములేపిన ధోని శిష్యుడు!

ఇరువైపులా బలమైన జట్లు ఉన్నట్లయితే.. మ్యాచ్ మాంచి మజాను ఇస్తుంది. అదే బ్యాటర్లు విఫలమై.. బౌలర్లు ప్రతాపం చూపించినట్లయితే..

T20 Blast: 8 సింగిల్ డిజిట్ స్కోర్లు.. 100లోపే ఆలౌట్.. 4 వికెట్లతో దుమ్ములేపిన ధోని శిష్యుడు!
Sam Curran
Ravi Kiran
|

Updated on: Jun 01, 2022 | 5:18 PM

Share

సిక్స్.. సిక్స్.. ఫోర్.. ఫోర్.. టీ20 క్రికెట్ అంటేనే బౌండరీల జోరు.. ఫ్యాన్స్ కేరింతల హోరు.. ఇరువైపులా బలమైన జట్లు ఉన్నట్లయితే.. మ్యాచ్ మాంచి మజాను ఇస్తుంది. అదే బ్యాటర్లు విఫలమై.. బౌలర్లు ప్రతాపం చూపించినట్లయితే.. ప్రతీ బంతి ఓ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి సీన్ ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్‌లో జరిగింది.

ఈ టోర్నీలో ఇటీవల సర్రే, గ్లౌసెస్టర్‌షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. పూర్తిగా బౌలర్లు డామినేట్ చేసిన ఈ మ్యాచ్‌లో సర్రే 37 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇందులో ధోని శిష్యుడు, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సామ్ కర్రన్ బంతితో చెలరేగిపోయాడు. తన కోటా 3 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో గ్లౌసెస్టర్‌షైర్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఆ జట్టు బౌలర్లు సర్రే బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. నిర్ణీత ఓవర్లలో సర్రే జట్టును 129 పరుగులకు కట్టడి చేయగలిగారు. టామ్ స్మిత్, వాన్ మీకేరెన్‌లు చెరో 3 వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ పెయిన్ 2 వికెట్లు, నసీం షా, హొవెల్ చెరో వికెట్ తీశారు. ఇక 130 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన గ్లౌసెస్టర్‌షైర్ జట్టు.. 92 పరుగులకే ఆలౌట్ అయింది. సామ్ కర్రన్ 4 కీలక వికెట్లు పడగొట్టి.. సర్రే విజయంలో కీలక పాత్ర పోషించాడు. కర్రన్‌తో పాటు టోప్లీ 2 వికెట్లు, వర్రాల్, నరైన్, జోర్డాన్, పొలార్డ్‌లు చెరో వికెట్ పడగొట్టారు.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..