AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మట్టి తవ్వుతుండగా వినిపించిన భారీ శబ్దం.. వెలికితీయగా బయటపడ్డ అరుదైన అద్భుతం!

ఇదొక క్రేజీ న్యూస్. ఓ పారిశ్రామిక ప్రాజెక్ట్ కోసం కేటాయించిన స్థలంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు మొదలుపెట్టారు...

Viral: మట్టి తవ్వుతుండగా వినిపించిన భారీ శబ్దం.. వెలికితీయగా బయటపడ్డ అరుదైన అద్భుతం!
Viral
Ravi Kiran
|

Updated on: May 30, 2022 | 9:21 PM

Share

ఇదొక క్రేజీ న్యూస్. ఓ పారిశ్రామిక ప్రాజెక్ట్ కోసం కేటాయించిన స్థలంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు మొదలుపెట్టారు. ఇక వారికి షాక్ కలిగించేలా భారీ శబ్డంతో ఓ అరుదైన అద్భుతం బయటపడింది. ఈ అరుదైన సంఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మెక్సికోలోని యుకాటన్ ప్రాంతానికి ఈశాన్య తీరంలో మెరిడా పట్టణం ఉంది. ఆ పట్టణానికి సమీపంలో ఒక పారిశ్రామిక ప్రాజెక్ట్‌ కోసం ఓ ప్రైవేటు స్థలాన్ని కేటాయించారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఆ స్థలంలో తవ్వకాలు జరపారు. ఇక వారికి షాక్ కలిగించేలా రాజభవనాలు, పిరమిడ్‌లతో కూడిన సుమారు 1500 సంవత్సరాల నాటి ఓల్డ్ మయాన్ నగరం ఒకటి బయటపడింది. ఆ రాజభవనాలు, పిరమిడ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వీటిల్లో వివిధ సామాజిక తరగతులకు చెందిన వ్యక్తులు ఉండి ఉంటారని.. పూజారులు, లేఖకులు.. రాజభవనాల్లో ఉండగా.. సాధారణ ప్రజలు మిగిలిన వాటిల్లో నివసించి ఉంటారని ఒక కన్‌క్లూజన్‌కు వచ్చారు.

ఆ ప్రైవేటు భూమిని సొంతం చేసుకున్న యజమానుల్లో ఒకరైన మౌరిసియో మోంటల్వో, తవ్వకాలు జరుపుతున్నప్పుడు భారీ శబ్దంతో ఓ పెద్ద రాయి మట్టిలో తగిలిందని.. ఆ తర్వాత ఈ అపారమైన భవనాలను వెలికితీశామని చెప్పుకొచ్చాడు. కాగా, ఆ వ్యక్తి కొనుగోలు చేసిన స్థలంలో ఈ పురాతన రాజభవనాలను కనుగొనడంతో అతడు నేషనల్ ఇన్‌స్టిట్యుట్‌ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ(INAH)కు ఆ సైట్‌ను అప్పగించేశాడు.

Follow Us
1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?
1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?
ఇది విన్నారా.. సగం ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు!
ఇది విన్నారా.. సగం ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు!
అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా?
అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా?
ఓటీటీలో మలయాళం బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ..
ఓటీటీలో మలయాళం బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ..
ఈడెన్ గార్డెన్స్‌లో పావెల్ విధ్వంసం.. లక్నో కు 182పరుగుల లక్ష్యం
ఈడెన్ గార్డెన్స్‌లో పావెల్ విధ్వంసం.. లక్నో కు 182పరుగుల లక్ష్యం
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్