Team India: సచిన్‌తో కలిసి ఆడాడు.. ఛాన్స్‌లు రాక కనుమరుగయ్యాడు.. కట్‌చేస్తే..

Dodda Ganesh Appointed As Kenya Cricket Team Head Coach: 5 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతని పేరిట మొత్తం ఆరు వికెట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశాడు. అతను దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 104 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 365 వికెట్లు, 89 లిస్ట్ A మ్యాచ్‌లలో 128 వికెట్లు సాధించాడు.

Team India: సచిన్‌తో కలిసి ఆడాడు.. ఛాన్స్‌లు రాక కనుమరుగయ్యాడు.. కట్‌చేస్తే..
Dodda Ganesh
Follow us
Venkata Chari

|

Updated on: Aug 14, 2024 | 2:46 PM

Dodda Ganesh Appointed As Kenya Cricket Team Head Coach: భారత మాజీ ఫాస్ట్‌బౌలర్‌ దోడా గణేష్‌‌కు ఓ పెద్ద బాధ్యత వచ్చింది. కెన్యా అతడిని సీనియర్ పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా నియమించింది. కెన్యాతో అతని ఒప్పందం ఒక సంవత్సరం పాటు ఉండనుంది. ఈ సమయంలో అతని అతిపెద్ద లక్ష్యం ప్రపంచ కప్‌నకు అర్హత సాధించడమే. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ దోడా గణేష్ నాలుగు టెస్టులు, ఒక వన్డేలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతను 1997 సంవత్సరంలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడాడు.

5 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతని పేరిట మొత్తం ఆరు వికెట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, దేశవాళీ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేశాడు. అతను దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 104 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 365 వికెట్లు, 89 లిస్ట్ A మ్యాచ్‌లలో 128 వికెట్లు సాధించాడు. అతని కాలంలో కర్ణాటక అత్యంత విజయవంతమైన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

ప్రపంచకప్‌నకు అర్హత సాధించడమే తొలి లక్ష్యం..

కెన్యా గణేష్‌తో ఒక సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది. నేషన్ ప్రకారం, ప్రపంచ కప్‌నకు అర్హత సాధించడమే తన మొదటి టార్గెట్ అని డోడా గణేష్ చెప్పాడు. కెన్యా 1996, 1999, 2003, 2011లో నాలుగు ODI ప్రపంచ కప్‌లు, ఒక T20 ప్రపంచ కప్ ఆడింది.

దోడా గణేష్ మాట్లాడుతూ.. కెన్యా 1996, 1999, 2003, 2011 ప్రపంచ కప్‌లలో పాల్గొంది. ఆ టీం డెడికేషన్, హార్డ్ వర్క్ చూశాను. గత 10 ఏళ్లలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను చరిత్ర గురించి మాట్లాడదలచుకోలేదు. కెన్యా ఛాంపియన్‌గా నేను సానుకూలంగా చూస్తున్నాను.

అక్కడికి వెళ్లే ముందు యూట్యూబ్‌లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లను చూశానని, దాని ఆధారంగా కెన్యా మంచి స్థితిలో ఉందని చెప్పగలనని 51 ఏళ్ల డోడా గణేష్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..