Video: మొన్న 35 బంతుల్లో తుఫాన్ సెంచరీ.. నేడు 2 బంతుల్లోనే దుకాణం బంద్
Vaibhav Suryavanshi Falls For Duck: రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ గత మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ బౌలర్లను చావుదెబ్బ కొట్టిన ఈ 14 ఏళ్ల బుడ్డోడు.. ముంబై ఇండియన్స్ బౌలర్ దీపక్ చాహర్ దెబ్బకు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

Vaibhav Suryavanshi Falls For Duck: రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ మైదానంలోకి అడుగుపెట్టగానే, గుజరాత్ టైటాన్స్‌పై తన మునుపటి ప్రదర్శనను పునరావృతం చేస్తాడని అంతా భావించారు. ముంబై బౌలర్లను చిత్తు చేస్తాడని అందరూ ఊహించారు. కానీ, అది జరగలేదు. సూర్యవంశీ తన ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. రాజస్థాన్, ముంబై మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ టోర్నమెంట్‌లోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
ఈ ఆటగాడు యశస్వి జైస్వాల్‌తో కలిసి 166 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. రాజస్థాన్ జట్టు కేవలం 15.5 ఓవర్లలో 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టోర్నమెంట్ చరిత్రలో 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి. కానీ, ముంబై ఇండియన్స్ బౌలర్లు ఆ యువ బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడానికి వేరే ప్రణాళికతో ముందుకు వచ్చారు. ఇటువంటి పరిస్థితిలో, దీపక్ చాహర్ ఖాతా తెరవకుండానే సూర్యవంశీని అవుట్ చేశాడు.
ఖాతా తెరవకుండానే సూర్యవంశీ ఔటైన వీడియో ఇక్కడ చూడండి..
https://t.co/uPnmCab1i5#VaibhavSuryavanshi #RRvsMI #IPL2025
— venkata chari thoudoju (@ThoudojuChari) May 2, 2025
దీపక్ చాహర్ బంతిని సూర్యవంశీ సిక్స్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ, షాట్ మిస్సవ్వడంతో బంతి విల్ జాక్స్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో సెంచీర ఇన్నింగ్స్ తర్వాత సూర్యవంశీ జీరోకే ఔట్ అవ్వడంతో రాజస్థాన్ ఫ్యాన్స్ అంతా షాకయ్యారు.
ఇరు జట్లు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, ఫజల్‌హక్ ఫరూఖీ.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్లు:
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: రాజ్ బావా, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్, రీస్ టోప్లీ, కర్ణ్ శర్మ.
రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్, క్వేనా మఫాకా.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








