AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అంపైర్ల సహాయంతో రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడా? రాజస్థాన్-ముంబై మ్యాచ్‌లో సరికొత్త వివాదం..

Rohit Sharma DRS Controversy: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే, రెండో ఓవర్లో థర్డ్ అంపైర్ నిర్ణయంతో సేవ్ అయ్యాడు. అయితే, ఇక్కడే ఓ వివాదం గందరగోళాన్ని సృష్టించింది.

Video: అంపైర్ల సహాయంతో రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడా? రాజస్థాన్-ముంబై మ్యాచ్‌లో సరికొత్త వివాదం..
Rohit Sharma Drs Controversy
Venkata Chari
|

Updated on: May 02, 2025 | 8:39 AM

Share

Rohit Sharma DRS Controversy: ఐపీఎల్ ప్రతి సీజన్‌లోనూ కొన్ని వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, ప్రస్తుత సీజన్ ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా గడిచిపోయింది. కానీ, ఐపీఎల్ 2025లో భాగంగా 50వ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విషయంలో ఓ వివాదం నెలకొంది. అది చర్చకు దారితీసింది. ఈ వివాదం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించినది. ఇందులో ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రివ్యూ తీసుకొని డీఆర్‌ఎస్‌లో నాటౌట్‌గా తేలాడు. దీంతో అంపైర్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబై మాజీ కెప్టెన్‌కు అంపైర్లు సహాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ మ్యాచ్ మే 1, గురువారం జైపూర్‌లో జరిగింది. దీనిలో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ, రోహిత్ శర్మకు DRS సహాయం లభించకపోతే ఇది జరిగేది కాదు. ఇదంతా ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో జరిగింది.

ఇవి కూడా చదవండి

ఈ ఓవర్‌లోని ఐదవ బంతికి ఊహించని సీన్..

ముంబై ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లోని ఐదవ బంతికి నాటకీయత చోటు చేసుకుంది. అంపైర్ రోహిత్ శర్మను ఎల్‌బీగా ప్రకటించాడు. అయితే, రోహిత్ క్రీజు వీడేందుకు సిద్ధమయ్యాడు. కానీ, తన భాగస్వామి రికిల్టన్ వద్దనడంతో చివరి క్షణంలో రివ్యూ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు థర్డ్ అంపైర్ బాల్ ట్రాకింగ్ సహాయం తీసుకున్నాడు. బంతి లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిందని తేలింది. దీంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది. రోహిత్ శర్మ సేవ్ అయ్యాడు. ఆ తరువాత అతను 53 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి రికిల్టన్‌తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

కానీ, సమీక్ష తీసుకోవడం ఆపై అంపైర్ తన నిర్ణయం ఇచ్చే రెండు సంఘటనల మధ్య ఓ గందరగోళం చోటు చేసుకుంది. రోహిత్ శర్మకు అంపైర్ సహాయం చేశాడా లేదా అనేది ఇప్పుడు తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి డీఆర్‌ఎస్ నిబంధనల ప్రకారం, సమీక్ష తీసుకోవడానికి 15 సెకన్ల సమయం ఉంది. కానీ, రోహిత్ సమీక్ష కోసం సిగ్నల్ ఇచ్చినప్పుడు, టైమర్ 0 సెకన్లు చూపిస్తోంది. అంటే, రోహిత్ 15 సెకన్లు ముగిశాయి. నిబంధనల ప్రకారం, అతని అప్పీల్ తిరస్కరణ అవ్వాలి. కానీ, అంపైర్లు మాత్రం రివ్యూ ఓకే చేయడం వెంటవెంటనే జరిగాయి. దీనిపై చాలా మంది వినియోగదారులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

రెండవ ప్రశ్న నిర్ణయం గురించి. బాల్ ట్రాకింగ్ రీప్లేలో బంతిలో కొంత భాగం స్టంప్స్ లైన్‌పై ఉన్నట్లు కనిపించింది. ఇటువంటి పరిస్థితిలో, చాలా మంది వినియోగదారులు దీనిని లెగ్ స్టంప్ వెలుపల బంతిగా ఎందుకు పరిగణించరనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు? కానీ, ఇక్కడ ఎటువంటి వివాదం లేదు. వాస్తవానికి నియమం గురించి అవగాహన లేకపోవడం అనే విషయం తెలుస్తోంది. దీనికి వ్యాఖ్యాత దీప్ దాస్ గుప్తా క్లారిటీ ఇచ్చారు. ఈ అనుమానాపై క్లారిటీ ఇస్తూ 50 శాతం బంతి, స్టంప్స్ లైన్‌లో కనిపించినప్పుడల్లా, అది స్టంప్స్‌పై పిచ్ అయినట్లుగా పరిగణిస్తుంటారు. ఈ సందర్భంలో అలా జరగలేదు. అందువల్ల థర్డ్ అంపైర్ నిర్ణయం సరైనదే.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..