IPL 2025 Points Table: 13 ఏళ్ల తర్వాత ముంబై తొలి విజయం.. కట్‌చేస్తే.. ఐపీఎల్ నుంచి రాజస్థాన్ ఔట్
IPL 2025 Points Table updated after RR vs MI: రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 13 ఏళ్ల తర్వాత రాజస్థాన్ సొంతగడ్డపై ముంబై విజయం సాధించింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా బిగ్ షాక్ తగిలింది.

IPL 2025 Points Table updated after RR vs MI: ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌ను 100 పరుగుల భారీ తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వెనక్కునెట్టింది. దీంతో ఆర్‌సీబీ రెండవ స్థానంలో నిలిచింది. ముంబై 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఖాతాలో 14 పాయింట్లు ఉండగా, నెట్ రన్ రేట్ +1.274గా ఉంది.
ఆర్‌సీబీ ఇప్పుడు రెండవ స్థానానికి చేరుకుంది. ముంబైతో సమానమైన విజయాలతోపాటు పాయింట్లను కలిగి ఉంది. కానీ, నెట్ రన్ రేట్ +0.521గా ఉంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండో స్థానానికి పడిపోయింది.
రాజస్థాన్ రాయల్స్ ఓటమి తర్వాత ఐపీఎల్ 2025 నుంచి నిష్క్రమించిన రెండవ జట్టుగా నిలిచింది. 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలు మాత్రమే సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
IPL 2025 50వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక..
1) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 7, ఓడినవి – 4, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 14, నెట్ రన్ రేట్ – +1.274)
2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 7, ఓడినవి – 3, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 14, నెట్ రన్ రేట్ – +0.521)
3) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 6, ఓడినవి – 3, ఫలితం లేదు – 1, టై – 0, ఫలితం తేలనివి – 13, నెట్ రన్ రేట్ +0.270)
4) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 9, గెలుపు – 6, ఓడినవి – 3, ఫలితం లేదు – 0, టై – 0, ఫలితం తేలనివి- 12, నెట్ రన్ రేట్ – +0.748)
5) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 6, ఓడినవి – 4, ఫలితం లేదు – 0, టై – 0, ఫలితం తేలనివి – 12, నెట్ రన్ రేట్ – +0.362)
6) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 10, విజయాలు – 5, ఓటములు – 5, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 10, నెట్ రన్ రేట్ – -0.325)
7) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 4, ఓడినవి – 5, ఫలితం తేలనివి – 1, టై – 0, పాయింట్లు – 9, నెట్ రన్ రేట్ – +0.080)
8) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 3, ఓడినవి – 8, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – -0.780)
9) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 9, గెలుపు – 3, ఓడినవి – 6, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – -1.103)
10) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 2, ఓటమి – 8, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – -1.211).
ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఓపెనర్లు రోహిత్ శర్మ (36 బంతుల్లో 53), ర్యాన్ రికెల్టన్ (38 బంతుల్లో 61) అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించగా, సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ రెండు వికెట్లకు 217 పరుగులు చేసింది. మూడు రోజుల క్రితం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4 ఓవర్లు మిగిలి ఉండగానే అద్భుత విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్.. ముంబై ఇచ్చిన టార్గెట్ ఛేదించలేక కేవలం 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. 11 మ్యాచ్‌ల్లో రాయల్స్‌కు ఇది ఎనిమిదో ఓటమి కాగా, ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ బ్యాటింగ్ మొత్తం విఫలమైంది. జోఫ్రా ఆర్చర్ అత్యధికంగా 30 పరుగులు చేయడం గమనార్హం.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








