రోహిత్ కెప్టెన్సీకి గుడ్‌బై.. షాకివ్వనున్న బీసీసీఐ.. వన్డేలో ఇకపై సారథ్యం వీరిదే.. లిస్టులో ముగ్గురు ప్లేయర్లు..

Indian Team Future ODI Captain: డిసెంబర్ 2021లో విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్ పదవి నుంచి తొలగించడం ద్వారా BCCI సంచలనం సృష్టించింది. అనంతరం భారత వన్డే సారథిగా రోహిత్ శర్మను నియమించారు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవచ్చు. రోహిత్ శర్మ నుంచి వన్డే కెప్టెన్సీ తప్పించేందుకు బీసీసీఐ ఇప్పటికే పలు ప్రణాళికలు వేస్తోంది.

రోహిత్ కెప్టెన్సీకి గుడ్‌బై.. షాకివ్వనున్న బీసీసీఐ.. వన్డేలో ఇకపై సారథ్యం వీరిదే.. లిస్టులో ముగ్గురు ప్లేయర్లు..
Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jul 19, 2023 | 12:52 PM

Team India Next ODI Captain: డిసెంబర్ 2021లో విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్ పదవి నుంచి తొలగించడం ద్వారా BCCI సంచలనం సృష్టించింది. అనంతరం భారత వన్డే సారథిగా రోహిత్ శర్మను నియమించారు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవచ్చు. రోహిత్ శర్మ నుంచి వన్డే కెప్టెన్సీ తప్పించేందుకు బీసీసీఐ ఇప్పటికే పలు ప్రణాళికలు వేస్తోంది. ఈమేరకు సమర్థవంతమైన ఆటగాళ్లపై ఓ కన్నేసింది. ఈ క్రమంలో ఈ ముగ్గురు ప్రమాదకరమైన ఆటగాళ్లు భారత సారథులుగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది 2023 వన్డే ప్రపంచకప్ ట్రోఫీని భారత్ గెలవాలని రోహిత్ శర్మపై చాలా ఒత్తిడి ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్ ఇండియా 2023 ప్రపంచకప్ ట్రోఫీని గెలవకపోతే, ‘హిట్‌మ్యాన్’ వన్డే కెప్టెన్సీని చేజార్చుకునే అవకాశం ఉంది. గత కొంత కాలంగా బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ పెద్దగా ఏమీ చేయలేకపోతున్నాడు.

1. హార్దిక్ పాండ్యా..

భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వన్డే కెప్టెన్‌గా అవతరించే అతిపెద్ద పోటీదారుడిగా అగ్రస్థానంలో నిలిచాడు. హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీతో అందరినీ తన అభిమానులుగా మార్చుకుంటున్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో, మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్ శైలి జత కలుస్తున్నాయి. అతని కెప్టెన్సీలో, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌తో IPL 2022 ట్రోఫీని కూడా గెలుచుకున్నాడు. హార్దిక్ పాండ్యా భారత వన్డే కెప్టెన్‌గా మారితే, అతను భారత్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే జట్టుగా మార్చగలడి నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

2. సూర్యకుమార్ యాదవ్..

మిస్టర్ 360 డిగ్రీగా పేరొందిన తుఫాన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ భారత వన్డే కెప్టెన్‌గా మారడానికి పెద్ద పోటీదారుడిగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్‌కు వన్డే జట్టులో స్థానం ఇప్పుడు ఖరారైంది. ఇక కెప్టెన్సీ మాత్రమే లేదు. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ దక్కిన తర్వాత టీమిండియా అదృష్టాన్ని కూడా మార్చగలడని మాజీలు అంటున్నారు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమ్ ఇండియాకు సూర్యకుమార్ యాదవ్ లాంటి డేంజరస్ బ్యాట్స్‌మెన్, తెలివైన కెప్టెన్ అవసరం. తన బ్యాటింగ్ లాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో కూడా దూకుడు తీసుకొస్తాడని, ఇది టీమ్ ఇండియాకు విపరీతంగా లాభిస్తుందని అంటున్నారు.

3. విరాట్ కోహ్లీ..

టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మరోసారి భారత వన్డే కెప్టెన్‌గా మారడానికి అతిపెద్ద పోటీదారుగా నిలిచాడు. గత ఏడాది డిసెంబర్ 2021లో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించింది. ఆ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. రోజర్ బిన్నీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన తర్వాత చేతన్ శర్మ సెలవు తర్వాత మళ్లీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి మార్గం సుగమమైంది. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు విరాట్ కోహ్లీ లాంటి దూకుడు కెప్టెన్ కావాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..