Video: విజయానికి 21 పరుగులు.. క్రీజులో డేంజరస్ ప్లేయర్.. కట్‌చేస్తే.. స్విమ్మింగ్ క్యాచ్‌తో షాక్.. వీడియో వైరల్..
MLC 2023: అలాగే చివరి ఓవర్లలో ప్రమాదకరంగా మారిన టిమ్ డేవిడ్ వికెట్ టెక్సాస్ సూపర్ కింగ్స్ కు కీలకంగా మారాడు. చివరి ఓవర్‌లో 21 పరుగులు కావాల్సి ఉంది. ఎంఐ న్యూయార్క్ తరపున టిమ్ డేవిడ్ క్రీజులో ఉన్నాడు.
MLC 2023, FAF DU PLESSIS Catch Viral: అమెరికన్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఫాఫ్ డుప్లెసిస్ తన అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ (TSK), MI న్యూయార్క్ (MINY) జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ డెవాన్ కాన్వే (74) అర్ధ సెంచరీతో 154 పరుగులు చేసింది.
ఈ భారీ మొత్తాన్ని ఛేదించిన ఎంఐ న్యూయార్క్ జట్టు 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 5వ ర్యాంక్‌లో బరిలోకి దిగిన టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్‌తో 24 పరుగులు చేశాడు.
అలాగే చివరి ఓవర్లలో ప్రమాదకరంగా మారిన టిమ్ డేవిడ్ వికెట్ టెక్సాస్ సూపర్ కింగ్స్ కు కీలకంగా మారాడు. చివరి ఓవర్‌లో 21 పరుగులు కావాల్సి ఉంది. ఎంఐ న్యూయార్క్ తరపున టిమ్ డేవిడ్ క్రీజులో ఉన్నాడు.
FAF TAKES A BLINDER! 🫣
Is that the game? pic.twitter.com/oPn4m2fo7x
— Major League Cricket (@MLCricket) July 18, 2023
చివరి ఓవర్ వేసిన డేనియల్ సామ్స్ బంతిని టిమ్ డేవిడ్ భారీ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి చాలా ఎత్తుకు ఎగిరింది. అదే సమయంలో బౌండరీ లైన్ నుంచి పరుగెత్తిన ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతంగా డైవ్ చేసి బంతిని పట్టుకున్నాడు.
39 ఏళ్ల వయసులో కూడా ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతమైన క్యాచ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు డుప్లెసిస్ ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టిమ్ డేవిడ్ ఔట్ కావడంతో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.