Rohit Sharma: రితికా సజ్దే ఇంట్రెస్టింగ్ పోస్ట్.. రోహిత్ కొడుకు పేరు ఏంటంటే?

Rohit Sharma's Wife Reveals Son Name: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచిన భారత జట్టు.. డిసెంబర్ 6 నుంచి జరగనున్న పింక్ బాల్ టెస్ట్ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ భార్య ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ను షేర్ చేసింది.

Rohit Sharma: రితికా సజ్దే ఇంట్రెస్టింగ్ పోస్ట్.. రోహిత్ కొడుకు పేరు ఏంటంటే?
Rohit Sharma Son Name
Follow us
Venkata Chari

|

Updated on: Dec 01, 2024 | 12:18 PM

Rohit Sharma’s Wife Reveals Son Name: వన్డే, టెస్టులలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ గత నెలలో ఓ గుడ్ న్యూస్ అందుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ భార్య రితికా సజ్దే రెండవ సారి తల్లి అయ్యింది. కొడుకుకు జన్మనిచ్చిన సంగతి తెలిసింది. ఈ విధంగా రోహిత్ కుటుంబం సంపూర్ణమైంది. ఇప్పుడు రోహిత్ – రితిక ఒక కుమార్తె, కొడుకుకు తల్లిదండ్రులు అయ్యారు. రితికా నవంబర్ 15న ఒక కొడుకుకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి అతని పేరు తెలుసుకోవాలని అభిమానులు తహతహలాడారు. ఇప్పుడు అతని పేరు వెల్లడించింది. రితికా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక కథనాన్ని పంచుకుంది. అందులో ఒక ఫొటో ఉంది. అందులో కొడుకు పేరు వెల్లడైంది. రోహిత్ కొడుకు పేరు అహాన్ అని తెలుస్తోంది.

ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్..

రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఇక్కడ భారత జట్టు ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడనుంది. ఇప్పటికే తొలి టెస్ట్ ఆడిన భారత్.. ఘన విజయంతో టూర్‌ని ప్రారంభించింది. ఈ క్రమంలో డిసెంబర్ 6 నుంచి మొదలుకానున్న పింక్ బాల్ టెస్ట్‌ను ఆడేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంతో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టుతో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..