Rohit Sharma: డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీటిపర్యంతమైన రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా కూర్చొని..
India vs England T20: టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోవడం..
టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోవడం అందరినీ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఫైనల్‌లో పాక్‌తో మ్యాచ్ ఉంటుందని భావించిన క్రికెట్ ప్రేమికు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెట్ ప్రేమికులే కాదు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సైతం ఈ దారుణ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. నిరాశ కాదు.. తీవ్ర మనోవేదనకు గురి చేసిందని చెప్పొచ్చు. మ్యాచ్‌లో ఓటమి తరువాత డ్రెస్సింగ్‌లో రూమ్‌లో ఒంటరిగా కూర్చున్న రోహిత్ శర్మ.. కన్నీటిపర్యంతం అయ్యాడు. తనను తాను నియంత్రించుకోలేక.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కంటనీరు పెట్టుకుంటూ విలపించాడు. రోహిత్ శర్మ కన్నీరు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ అభిమానులు.. దీనిపై ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. బాధపడొద్దంటూ ధైర్యం చెబుతూ కామెంట్స్ చెబుతున్నారు.
T20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ జరిగిన సెమీఫైనల్‌లో భారత్-ఇంగ్లండ్ తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి, 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా టార్గెట్‌ను ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా బౌలర్లపై భీకరంగా దాడి చేశారు. ఈ క్రమంలో హేల్స్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి, భారత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అలాగే మరో ఎండ్ నుంచి ఇంగ్లండ్ సారథి కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఎన్నో అంచనాలతో సెమీస్ చేరిన టీమిండియాకు మరోసారి ఫైనల్ చేరకుండానే ఇంటిబాట పట్టింది.
రోహిత్ శర్మ ఇప్పటి వరకు ప్రతీ T20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. అయితే, తొలి టోర్నమెంట్‌లో మాత్రమే కప్ గెలిచిన టీమ్‌లో భాగస్వామ్యం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా కప్ సాధించలేదు. టీమిండియా దూకుడు చూసి ఈ సారైనా కప్ సాధిస్తారని క్రికెట్ అభిమానులంతా భావించారు. కానీ, ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో నిరాశే మిగిలింది.
Please god, I’m begging, give me all the pain of my @ImRo45, but pls don’t do this to him. ???pic.twitter.com/zHeoTOB6kW
— Vishal. (@SportyVishal) November 10, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..