AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : ప్లీజ్.. నన్ను అలా పిలవద్దు.. ఫ్యాన్స్​ను వారించిన రోహిత్.. వీడియో వైరల్

వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో సమయం గడుపుతున్నారు. గత సంవత్సరంన్నరలో భారత్‌కు రెండు ఐసీసీ టైటిల్స్ అందించిన ఈ 38 ఏళ్ల క్రికెటర్, ఇటీవల ముంబైలోని ఒక గణపతి పూజలో పాల్గొని దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు.

Rohit Sharma : ప్లీజ్.. నన్ను అలా పిలవద్దు.. ఫ్యాన్స్​ను వారించిన రోహిత్.. వీడియో వైరల్
Mumbai Cha Raja
Rakesh
|

Updated on: Sep 06, 2025 | 8:42 AM

Share

Rohit Sharma : టెస్ట్, టీ20 క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలో తన కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. గత సంవత్సరన్నరలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రోహిత్, ఇటీవల ముంబైలో గణపతి పూజ సందర్భంగా గణనాథుని ఆశీర్వాదం తీసుకున్నాడు. ముంబైలో గణపతి వేడుకల నుంచి ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోహిత్, ఫ్యాన్స్ ముంబై కా రాజా రోహిత్ శర్మ అని నినాదాలు చేయవద్దని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాడు. సాధారణంగా రోహిత్ అభిమానులు అతని స్టార్‌డమ్‌ను కొనియాడటానికి ఇలా నినాదాలు చేస్తుంటారు. కానీ, తాజాగా వైరల్ అయిన వీడియోలో, అలా చేయవద్దని రోహిత్ వారిని కోరాడు.

ఆస్ట్రేలియా టూర్​కు రోహిత్..

వన్డే క్రికెట్‌లో 11,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రోహిత్, చివరిసారిగా మార్చి 9న దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో టీమ్ ఇండియా తరఫున ఆడాడు. ఆ మ్యాచ్​లో రోహిత్ 76 పరుగులు చేసి టీమ్ ఇండియాను గెలిపించాడు. దీంతో టీమ్ ఇండియా 27 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో 76 పరుగులు చేసినందుకు రోహిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

రోహిత్ త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. టీమ్ ఇండియా వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించి, మూడు మ్యాచ్‌ల వన్డే, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లలో పాల్గొంటుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19న పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. తదుపరి రెండు వన్డే మ్యాచ్​లు అక్టోబర్ 23న అడిలైడ్‌లో, అక్టోబర్ 25న సిడ్నీలో జరుగుతాయి.

చరిత్ర సృష్టించడానికి సిద్ధమైన రోహిత్

గత 18 సంవత్సరాలలో రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో టీమ్ ఇండియా తరఫున మొత్తం 499 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్ ఆడితే, అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్​లు ఆడిన ఐదవ భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (664), విరాట్ కోహ్లీ (550), ఎంఎస్ ధోని (535), రాహుల్ ద్రవిడ్ (504) ఉన్నారు. అలాగే, ఈ సిరీస్​లో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను 499 మ్యాచ్​లలో 19,700 పరుగులు చేశాడు.

అంతేకాకుండా, రోహిత్ సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 54 పరుగుల దూరంలో ఉన్నాడు. గంగూలీ వన్డేలలో 11,221 పరుగులు చేశాడు. రోహిత్ ఈ రికార్డును అధిగమించి, వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన మూడవ భారతీయ ఆటగాడిగా నిలుస్తాడు. వన్డేలలో రోహిత్ ఇప్పటివరకు 273 మ్యాచ్​లలో 344 సిక్సర్లు కొట్టాడు. షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టి నంబర్ 1 స్థానానికి చేరుకోవడానికి అతనికి మరో ఎనిమిది సిక్సర్లు అవసరం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో