ICC Rankings: బాబర్‌ ఆధిపత్యానికి ఇచ్చిపడేస్తోన్న రోహిత్.. ఆ విషయంలో హిట్‌మ్యాన్ దూకుడు

ICC ODI Batters Rankings: ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ తాజా ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతాలు చేశాడు. అతను భారత క్రికెట్‌లో ప్రస్తుత నంబర్-1 వన్డే బ్యాట్స్‌మెన్‌గా మారాడు. యంగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌ను వదిలి ఈ స్థానం సాధించాడు. రోహిత్ శర్మ వెనుక విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. అసలైన, రోహిత్ శర్మ తన సహచర బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నుంచి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ICC Rankings: బాబర్‌ ఆధిపత్యానికి ఇచ్చిపడేస్తోన్న రోహిత్.. ఆ విషయంలో హిట్‌మ్యాన్ దూకుడు
Rohit Sharma Records
Follow us
Venkata Chari

|

Updated on: Aug 14, 2024 | 7:40 PM

ICC ODI Batters Rankings: ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ తాజా ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతాలు చేశాడు. అతను భారత క్రికెట్‌లో ప్రస్తుత నంబర్-1 వన్డే బ్యాట్స్‌మెన్‌గా మారాడు. యంగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌ను వదిలి ఈ స్థానం సాధించాడు. రోహిత్ శర్మ వెనుక విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. అసలైన, రోహిత్ శర్మ తన సహచర బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ నుంచి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్ టూ బ్యాట్స్‌మెన్‌గా మారాడు. గిల్ మూడో స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

బాబర్ ఆజం ఆధిప్యతానికి చెక్..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ నంబర్-2కు చేరుకోగానే బాబర్ అజామ్ స్థానానికి ముప్పు ఏర్పడింది. వన్డేల్లో ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. భారత కెప్టెన్ కూడా బాబర్ అజామ్ టాప్ ర్యాంకింగ్‌కు చేరువయ్యాడు. అతను బాబర్ అజామ్ 824 పాయింట్ల కంటే 59 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. భారత యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ మూడో స్థానానికి దిగజారగా, విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు.

అద్భుతమైన ఫాంలో హిట్‌మ్యాన్..

శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రోహిత్ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఈ మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-2తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 37 ఏళ్ల రోహిత్ 3 మ్యాచ్‌ల్లో 52.33 సగటు,141.44 స్ట్రైక్ రేట్‌తో 157 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతను మూడు మ్యాచ్‌లలో అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. కానీ, అతని పరుగులను ట్రిపుల్ డిజిట్‌లుగా మార్చలేకపోయాడు. అతని అత్యుత్తమ స్కోరు 64 పరుగులు.

నాలుగో స్థానంలో కోహ్లీ..

శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లి ఆటతీరు బాగాలేదు. మూడు మ్యాచ్‌ల్లో 58 పరుగులు మాత్రమే చేశాడు. యంగ్ స్టార్ బ్యాట్స్‌మెన్ గిల్ కూడా శ్రీలంక గడ్డపై పోరాడుతూ కనిపించాడు. మూడో వన్డేలో 96 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ అవిష్క ఫెర్నాండో 20 స్థానాలు ఎగబాకి 68వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఐరిష్ బ్యాట్స్‌మెన్ హ్యారీ టెక్టర్ కూడా 746 రేటింగ్ పాయింట్లతో టాప్-5లో కొనసాగుతున్నాడు.

కుల్దీప్ యాదవ్ నంబర్-1 భారత బౌలర్..

కుల్దీప్ యాదవ్ భారత నంబర్-1 వన్డే బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బౌలర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో కేశవ్ మహరాజ్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా వరుసగా టాప్-3లో ఉన్నారు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో, ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ మూడు మ్యాచ్‌లలో 3.40 ఎకానమీ రేటుతో నాలుగు వికెట్లు పడగొట్టాడు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 8వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు మహ్మద్ సిరాజ్ 5 స్థానాలు దిగజారి 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..